తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం చరిత్రదాయకం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌:రైతులకు పంట పెట్టబడి సాయాన్ని రూ.16 వేలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌( kcr ) బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించడం చారిత్రాతమ్మకమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.ఎకరానికి రూ.8 వేలతో మొదలైన రైతుబంధు సాయాన్ని.రూ.10 వేలకు పెంచుకున్నామని, వచ్చే ఏడాది నుంచి రూ.12 వేలకు పెంచుతామన్నారు.క్రమంగా ప్రతీ ఏటా పెంచుతూ రూ.16 వేలు అందిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )తెలిపారు.రైతులకు పంట పెట్టుబడి కోసం స్వతంత్ర్య భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి అందించేందుకు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక రైతు బంధు అని చెప్పారు.

 Rythu Bandhu Scheme Being Implemented In Telangana Is A History Maker Mlc Kavith-TeluguStop.com

ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన గొప్ప కార్యక్రమని తెలిపారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన సీఎం కేసీఆర్‌కు అన్ని జిల్లాల్లో అన్నదాతలు మద్దతు పలుకుతుండటంతో.రానున్న ఎన్నికలలో రైతుల ఆశీర్వాదం కోరుతున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube