ఈ మధ్యకాలంలో విడుదల అవుతున్న చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.అందుకు గల కారణం సినిమాలలో కొత్త కంటెంట్ లేకపోవడమే అని చెప్పవచ్చు.
ప్రేక్షకులు కూడా కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు.దీంతో కొత్త కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి.
కంటెంట్ కొత్తగా లేని సినిమాలు అది పెద్ద హీరోయినా చిన్న హీరో అయినా సరే థియేటర్లలో కొద్ది రోజులు కూడా సినిమా ఆడటం లేదు.దీంతో ఇటువంటి సినిమాలు ఓటిటిలో విడుదలైన మరికొద్ది రోజులకే టీవీలలో కూడా ప్రసారమవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇక ఈమధ్య కాలంలో సరికొత్త కథలతో కొన్ని సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా మరొక అలాంటి కొత్త కథతో తెలుగు సినిమా రాబోతోంది.
ఆ సినిమా మరేదో కాదు రుద్రప్ప.ఇందులో రమేష్ అన్నవరపు హీరోగా నటిస్తున్నారు.
మొదట స్టాకర్ అనే సినిమాతో కన్నడ ప్రేక్షకులను పలకరించిన రమేష్ అన్నవరపు ఈ రుద్రప్ప సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.ఈయన మెగాస్టార్ చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్ కావడం విశేషం.
హేమంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఎంఎల్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.
సుధీర్ పి.ఆర్.ఈ సినిమాకు డీఓపీ, ఆర్ట్ డైరెక్టర్‌గా సుధీర్ పి.ఆర్.వ్యవహరిస్తున్నారు.
పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ ప్రయోగాత్మక చిత్రం కి సంబంధించిన టీజర్‌ను తాజాగా ఆదివారం విడుదల చేశార.ఇక రుద్రప్ప టీజర్ కొత్తగా ఆసక్తికరంగా ఉంది.
టీజర్ ని చూస్తుంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కాగా రుద్రప్ప సినిమా రెగ్యులర్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపారు.
అంతేకాకుండా వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు చిత్ర బృందం.