మెగాస్టార్ చిరంజీవి 154 వ సినిమా టైటిల్ విషయంలో నిన్న మొన్నటి వరకు సస్పెన్స్ నెలకొంది.సినిమా ప్రకటించిన సమయం లోనే వాల్తేరు వీరయ్య.
వాల్తేరు వీరన్న అనే టైటిల్స్ ప్రచారం జరిగాయి.ఆ మధ్య దర్శకుడు బాబీ మాట్లాడుతూ సినిమా కు టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదని, కన్ఫామ్ చేసిన సమయంలో తప్పకుండా అందరికీ చెప్తామని.
ప్రస్తుతానికి ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దు అంటూ మీడియాకు విజ్ఞప్తి చేయడం జరిగింది.దాంతో వాల్తేరు వీరన్న లేదా వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ కాదని అంతా భావించారు.
కానీ నేడు దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోసం ఈ సినిమా యొక్క టైటిల్ రివిల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేయడం జరిగింది.

టైటిల్ గా వాల్తేరు వీరయ్య కన్ఫామ్ చేశారు.వాల్తేరు వీరయ్య టైటిల్ ను మొదట కాదన్నారు, కానీ ఇప్పుడు మళ్లీ అదే టైటిల్ తో సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.మెగాస్టార్ చిరంజీవి కి ఆ టైటిల్ సూపర్ గా సెట్ అవుతుంది అంటూ అభిమానులు మొదటి నుంచి అంత భావించారు.
తాజాగా విడుదలైన టీజర్ లో చిరంజీవి లుక్ గ్యాంగ్ లీడర్ ముఠామేస్త్రి లో చిరంజీవిని చూసినట్లుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.టైటిల్ కూడా అదే మాస్ రేంజ్ లో ఉంటే తప్పకుండా సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేసినారు.
ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు, కనుక అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే.







