ఆ రెండు డేట్స్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్.. ఈసారి ఫిక్స్?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది.

 Rrr Sought On Those Two Dates Rrr, Ram Charan, Ntr, Rajamouli , Relese Date-TeluguStop.com

అయితే కరోనా కారణం చేత వాయిదా పడిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీ విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు.అయితే అక్టోబర్ 13 కూడా సినిమా విడుదల కాలేదని తెలియడంతో ప్రేక్షకులు అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్లో ఓపెన్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి.ఇలా అన్ని సినిమాలు విడుదల తేదీని ప్రకటిస్తున్నప్పటికీ రాజమౌళి మాత్రం తన సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు.

దీంతో అభిమానులలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.అయితే రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని ఆ రెండు తేదీలపై కన్నేసి ఉంచారు.

Telugu Ajay Devgan, Rajamouli, Ram Charan, Relese, Tollywood-Movie

రాజమౌళి అనుకున్న ప్రకారమే క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదలైతే పుష్ప సినిమా వెనక్కు తగ్గాల్సి ఉంటుంది.లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనౌన్స్ చేస్తే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ మరోసారి వారి సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుందని సమాచారం.మరి జక్కన్న వీటిలో ఏ తేదీలను ఫిక్స్ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube