జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చిన వాళ్లలో రీతూ చౌదరి(rithu chowdary) ఒకరు.ఈ షో ద్వారా ఆమెకు సోషల్ మీడియాలో సైతం అంచనాలకు మించి పాపులారిటీ పెరిగింది.
అయితే కొన్ని వారాల క్రితం రీతూ చౌదరి తండ్రిని కోల్పోయారు.తండ్రి మరణ వార్త విని ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు.
సోషల్ మీడియా వేదికగా రీతూ చౌదరి పెడుతున్న పోస్ట్ లు సైతం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో రీతూ చేసిన కామెంట్స్ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
బాబా పటం పెట్టుకున్న చోటే నాన్న ఫోటో పెట్టుకున్నానని రీతూ చౌదరి చెప్పుకొచ్చారు.రష్మీ(Rashmi) రీతూ చౌదరితో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మీ జీవితంలో ఊహించని ఘటన జరిగిందని చెప్పగా రీతూ చౌదరి కన్నీళ్లు పెట్టుకున్నారు.
సాయిబాబా పటం పెట్టుకునే చోట మా నాన్న పటం పెట్టుకునే పరిస్థితి వచ్చిందని రీతూ చౌదరి తెలిపారు.
రీతూ చౌదరి కామెంట్లతో షో అంతా ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం ఏర్పడింది.రీతూ చౌదరికి తండ్రి ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రీతూ చౌదరి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ మరిన్ని సక్సెస్ లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రీతూ చౌదరి సినిమాలపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
రీతూ చౌదరి టాలెంట్ ఉన్న నటి అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ లో రీతూ చౌదరి కెరీర్ ను కొనసాగించాలని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.రీతూ చౌదరి కెరీర్ కు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
రీతూ మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.