బీఆర్ఎస్ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్థి అని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు మాట్లాడుకునే పాదయాత్రలు చేస్తున్నారని తెలిపారు.
రేవంత్ రూట్ మ్యాప్ వేరు.భట్టి ర్యూట్ మ్యాప్ వేరని మల్లు రవి వెల్లడించారు.
రేవంత్ టచ్ చేయని నియోజకవర్గాల్లో భట్టి పాదయాత్ర చేస్తారని చెప్పారు.రేవంత్ చేసిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందన్నారు.
కాంగ్రెస్ లో రీ-పోలరైజేషన్ జరుగుతుందన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విభజన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.