నల్లజాతీయుల నిరసనలు...18 కోట్లు నష్టపోయిన భారతీయుడు...!!

అమెరికాలో ఒక వైపు అధ్యక్ష ఎన్నికల హడావుడి జోరుగా సాగుతున్నతరుణంలో మరొకవైపు జాత్యహంకార నిరసనలు హోరెత్తుతున్నాయి.నల్లజాతీయులపై అమెరికా ప్రభుత్వం చూపిస్తున్న జాత్యహంకార ధోరణిపై సర్వత్రా నిరసన రేగుతోంది.

 Rioters Destroy Indian-origin Family's Car Dealership In Us, Us, Rioters, Black-TeluguStop.com

గడించిన కొన్ని నెలలుగా చూస్తే ఇద్దరు నల్ల జాతీయుల అయిన జార్జ్ ఫ్లాయిడ్ , బ్రూన్స్ ల హత్యలతో ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఆ ఘటనలు ఇంకా మరువక ముందే కొన్ని రోజుల క్రితం జాకబ్ బ్లేక్ అనే నల్లజాతీయుడు ను పోలీసులు కాల్చి చంపడం తో మరో మారు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలోనే ఆందోళన కారులు విస్కాన్సిన్ లో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.వీరి నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.బ్లేక్ కి న్యాయం జరగాలని రెచ్చిపోయిన నిరసన కారులు భారత సంతతి వ్యక్తికి చెందిన కార్ల డీలర్ షిప్ కంపెనీకి నిప్పు అంటించారు.

Telugu Black, Car Dealership, Racism, Rioters, Riotersdestroy-

భారత సంతతికి చెందిన అన్మోల్ కింద్రీ అనే వ్యక్తి ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు.కార్ల డీలర్ షిప్ ఏర్పాటు చేసుకున్న ఆయన లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నిరసన కారులు కంపెనీకి నిప్పు పెట్టడంతో దాదాపు 100 వాహనాలు కాలి బూడిద అయిపోయాయి, అంతేకాదు 18కోట్ల పైనే తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube