వరంగల్ టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో విద్యార్థి హరీశ్ కు ఊరట లభించింది.పదో తరగతి పరీక్షలు రాసేందుకు హరీశ్ కు హైకోర్టు అనుమతిని ఇచ్చింది.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పరీక్షలు రాసేందుకు అనుమతిని ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.అయితే పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి హరీశ్ డిబార్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో డిబార్ చేయడంపై హరీశ్ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం విద్యార్థికి పరీక్షలు రాసేందుకు పర్మిషన్ ఇచ్చింది.