డ్రగ్స్ రిటైలర్ బూట్స్ ని టేకోవర్ చేస్తోన్న రిలయన్స్!

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, బ్రిట‌న్‌లోకెల్లా అతిపెద్ద డ్ర‌గ్స్ రిటైల‌ర్ సంస్థ అయినటువంటి వాల్‌గ్రీన్స్ బూట్స్ అల‌యెన్స్‌ను సొంతం చేసుకోబోతున్నారు.ఇతను తాజాగా అమెరికా సంస్థ అపొలోలో గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్‌తో క‌లిసి బూట్స్ టేకోవ‌ర్ కోసం బిడ్ స‌మ‌ర్పించారు.

 Reliance Takeover Drugs Retailer Boots Details, Drugs, Retail, Viral Latest, New-TeluguStop.com

ఈ టేకోవ‌ర్ ఒప్పందం విలువ 5 బిలియ‌న్ల పౌండ్లు.అంటే మన రూపాయలలో సుమారు రూ.48 వేల కోట్లు ఉండొచ్చున‌ని ఈ చ‌ర్చ‌ల‌తో సంబంధం ఉన్న వ్య‌క్తుల ద్వారా సమాచారం అందింది.ఇక బూట్స్ విలువ దాదాపు 7 బిలియ‌న్ల పౌండ్లు అని, అంత మొత్తానికి విక్ర‌యించాల‌ని యోచిస్తున్న‌ట్లు స‌మాచారం.

బ్రిట‌న్‌లో బూట్స్‌కు దాదాపుగా 2, 200 స్టోర్ల నెట్‌వ‌ర్క్ కలదు.కొన్ని వారాల్లో బూట్స్ టేకోవ‌ర్ బిడ్ విజేత‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం లేకపోలేదు.వాటా విక్ర‌యం త‌ర్వాత కూడా ఈ బిజినెస్‌లో కొంత వాటా క‌లిగి ఉండాల‌ని వాల్‌గ్రీన్స్ ప్లాన్లు రూపొందించింది.రిల‌య‌న్స్ అపొలో గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్‌ల‌తో కూడిన క‌న్సార్టియం, బ్రిట‌న్ బిలియ‌నీర్లు ఈషా బ్ర‌ద‌ర్స్‌-టీడీఆర్ క్యాపిట‌ల్ క‌న్సార్టియం కూడా బూట్ టేకోవ‌ర్ కోసం పోటీ ప‌డ్డాయి.

కానీ.బూట్స్ విలువ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని భావిస్తూ.

పోటీ లో నుంచి ఈషా బ్ర‌ద‌ర్స్ క‌న్సార్టియం పక్కకు జరిగింది.

Telugu Drugs, Drugsretailer, Esha Brother, Mukesh Ambani, Pharma Company, Relian

ఇలాంటి ప‌రిస్థితుల్లో రిల‌య‌న్స్‌ అపొలో గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్‌కు బూట్స్ సొంతం అయ్యే అవ‌కాశాలు పెరిగాయని నిపుణులు అంటున్నారు.గత దశాబ్దకాలంగా రిలియన్స్ వివిధ రంగాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసినదే.టెలికమ్యూనికేషన్ రంగంలో గతంతో పోల్చుకుంటే రిలియన్స్ జియో ఇప్పుడు దూసుకుపోతుంది.ఇదివరకు టాప్ రేసులో వున్న ఎయిర్ టెల్, ఐడియాని సైతం వెనక్కినెట్టి జియో రాజ్యమేలుతోంది.2021 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేషన్‌ల ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో రిలియన్స్ కంపెనీ 155వ స్థానంలో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube