తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 7షో( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.కాగా బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇక తాజాగా నాలుగో వారం ఎలిమినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.ఇప్పటికే హౌస్ లో నుంచి ముగ్గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవ్వగా తాజాగా నాలుగో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయింది.
టైటిల్ ఫేవరెట్ అనే అనుకుంటున్నా కంటెస్టెంట్ రతిక ఎలిమినేట్ అయింది.ఓట్లు తక్కువగా రావడంతో బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) నుంచి నాలుగో వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.
అయితే ముందు నుంచి అందరూ భావించినట్టుగానే నాలుగో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్( Lady Contestant ) అయ్యి బయటకు వచ్చేసింది.అంతే కాకుండా నాలుగో వారం రతిక ఎలిమినేట్( Rathika Elimination ) అవ్వడం ఖాయం అంటూ రెండు మూడు రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నట్టుగానే చివరకు రతిగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.ఇకపోతే ఈమె బిగ్‌బాస్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth )తో క్లోజ్ అయింది.వీళ్లిద్దరూ ప్రేమ పక్షులు అనే రేంజులో రెచ్చిపోయారు.
తీరా రెండో వారానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది.యవర్‌తో ప్రేమ లాంటి వ్యవహారం కూడా బెడిసికొట్టింది.
ప్రశాంత్, యవర్‌తో క్లోజ్‌గా ఉంటూనే వాళ్లకు వెన్నుపోటు పొడిచింది.
ఇది ఆమెకు గేమ్ ప్లాన్‌లా అనిపించొచ్చు కానీ ప్రేక్షకులకు నచ్చలేదు.
ఆమెని ఎలిమినేట్ చేసేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రతిక రెమ్యూనరేషన్( Rathika Rose Bigg Boss Remuneration ) కి సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
నాలుగు వారాలకు గాను రతిక ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది అన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.కాగా ప్రతివారం రూ.2 లక్షలు చొప్పున అంటే నాలుగు వారాలకు కలిపి రూ.8 లక్షలు సొంతం చేసుకుందని తెలుస్తోంది.