మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 4వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో మాజీ మంత్రి నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే.అయితే నారాయణకు సీఐడీ అధికారులు మెయిల్ ద్వారా నోటీసులు పంపారు.
ఇదే కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ కు సైతం సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.