టాలీవుడ్ ఇండస్ట్రీలో తరచూ వివాదాలలో నిలిచే డైరెక్టర్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తలదూర్చి ప్రతి విషయాన్ని వివాదాస్పదంగా మారుస్తూ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
రాంగోపాల్ వర్మ ఏ విషయంలో అయినా నెగిటివ్ గానే స్పందిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.వర్మ ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుతూ.
కామెంట్ చేస్తూ ఉంటారు.మందు తాగి అమ్మాయిలతో చిందులేసిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వటంతో ఈయనను అందరూ అమ్మాయిల పిచ్చోడు అంటారు.
కానీ ఇటీవల జరిగే ఇంటర్వ్యూ లో రాంగోపాల్ వర్మ సోదరి ఆయన గురించి మాట్లాడుతూ కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడించారు.రామ్ గోపాల్ వర్మ షో అప్ కోసం వర్మ అమ్మాయిలతో తిరుగుతాడని, అమ్మాయిల విషయంలో ఏ రోజూ వర్మ నోరుజారింది లేదని తమ చిన్ననాటి కొన్ని విషయాలు వెల్లడించారు.
అందువల్ల వర్మలో ఈ కోణం కూడా ఉంది అని అందరికి తెలిసింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్మ ఇటీవల ఒక ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.కుక్కతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది.
ఈ ఫోటో చూసిన ఒక నెటిజన్ మందు తాగి మత్తులో ఉండి సన్నీలియోన్ అనుకోని కుక్కను పట్టుకున్నవా అని కామెంట్ చేశారు.