పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పూనకాలు వస్తాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన భీమ్లా నాయక్ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 25న విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది.
పవన్ కళ్యాణ్ – రానా కు మధ్య ఉన్న సన్నివేశాలు సినిమా హిట్ అవ్వటానికి బాగా దోహదపడ్డాయి.ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.
మలయాళ సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఆలోచన వచ్చిన వెంటనే తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రీన్ ప్లే రచించాడు.ఈ సినిమాకు మొదటగా వివేక్ ఆత్రేయ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని భావించాడు.
బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నాడు.
కానీ అప్పటికే నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘అంటే సుందరానికి‘ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ కు డేట్స్ కుదరక భీమ్లా నాయక్ సినిమా వదులుకోవాల్సి వచ్చింది.
అందువల్ల ఈ సినిమా దర్శకుడిగా సాగర్ కె చంద్ర ను ఫైనల్ చేశాడు.
సాగర్ కూడా తెలుగు అభిమానులను ఆకట్టుకునే విధంగా సినిమా తెరకెక్కించాడు.భీమ్లా నాయక్ సినిమాకు తమన్ అందించిన సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.భీమ్లా నాయక్ సినిమా ఆంధ్ర-తెలంగాణ లతోపాటు ఓవర్సీస్ లో కూడా విజయ వంతంగా దూసుకుపోతూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది.