టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారడంతో పాటు గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్.ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నాడు చెర్రీ.ట్రూజెట్( Trujet ) పేరుతో ఎయిర్‌లైన్స్ రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
సహజంగా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్‌గా ఉండే రామ్ చరణ్ ఇప్పుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించి వార్తలు కూడా గత కొద్దీ రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.చెర్రీ ఐపీఎల్‌లో టీమ్ కొనుగోలు చేస్తున్నాడంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే టీమ్‌గా ఉంది.ఇది కూడా తమిళనాడుకు చెందిన కావ్యా మారన్ ఓనర్‌గా ఉంటే ఏపీ నుంచి మాత్రం ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ ప్రాతినిథ్యం లేదు.దీంతో రామ్ చరణ్ ఏపీ నుంచి ఐపీఎల్ టీమ్ ( IPL )కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి వైజాగ్ వారియర్స్ అనే పేరు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే చర్చలు కూడా తెలుస్తోంది.అయితే రామ్‌చరణ్ ఐపీఎల్‌లో టీమ్ ఎలా కొనుగోలు చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది.చెర్రీ కొనబోయేది ఐపీఎల్ కాదని, ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఏపీఎల్‌లో అనీ తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలో యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్ధేశంతో గత ఏడాది ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది.
తొలి సీజన్ కూడా విజయవంతంగా ముగిసింది.ఈ లీగ్‌లో పలువురు వ్యాపారవేత్తలు ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు.ఆరు జట్లతో గత ఏడాది జరిగిన సీజన్ ద్వారా పలువురు యువక్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.
కాగా రామ్‌చరణ్ ఏపీఎల్‌లో ఉన్న వైజాగ్ వారియర్స్ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.