బన్నీ రికార్డులను పవన్, రాంచరణ్ బద్దలు కొట్టేనా?అల్లు అర్జున్.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈయన పేరు మార్మోగిపోతుంది.
ఆయన హీరోగా చేసిన గత రెండు సినిమాలు అద్భుత గుర్తింపు తీసుకొచ్చాయి.ఇండస్ట్రీలో ఆయను కనీవీని ఎరుగని గుర్తింపు తీసుకొచ్చాయ.
ఆయన గత మూవీ అల వైకుంఠపురంలో తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.నాన్ బాహుబలి రికార్డ్స్ ను తిరగ రాశాడు.
టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది.అల్ల అర్జున్ ను 2 వందల కోట్ల క్లబ్ లో చేర్చింది.
ఈ సినిమా అప్పట్లో తెలుగు, మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది.ఆ తర్వాత పాన్ ఇండియా రేంజిలో పుష్ప సినిమా చేశాడు.
దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు.అనుకున్నట్లుగానే ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.ఇప్పటి వరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
ప్రస్తుతం మెగా హీరోల్లో బన్నీ రికార్డులు బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు.పవన్ కల్యాణ్ సైతం పుష్ప రికార్డులను అందుకోవడం కష్టం.మెగా ఫ్యామిలీ నుంచి మంచి ఫ్యాన్ బేస్, మార్కెట్ ఉన్న నటుడు పవన్ కల్యాణ్.ఆయన నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న జనాల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా కేవలం తెలుగులోనే విడుదల అవుతుంది.అయితే ఈ సినిమా పుష్ప వసూళ్ల రికార్డును బ్రేక్ చేయడం కష్టం.
అటు పాన్ ఇండియన్ మూవీగా వస్తున్న హరిహర వీరమల్లు.హిట్ కొడితే అల్లు అర్జున్ పుష్ప రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉంది.
అటు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ ఆర్ఆర్ఆర్.ఈ సినిమాతో బన్నీకి రాం చరణ్ బ్రేక్ వేసే అవకాశం ఉంది.ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమా ఈజీగా పుష్ప రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.ప్రస్తుతం వసూళ్ల పరంగా అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు .