మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram charan )హీరోగా శంకర్ దర్శకత్వం లో ఒక భారీ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న గేమ్ ఛేంజర్ సినిమా ను దిల్ రాజు దాదాపుగా రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.శంకర్ సినిమా అంటే పాటల్లో రిచ్ నెస్ కనిపిస్తుంది.
ఇక సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాల విషయం లో కూడా చాలా హైప్ ఉంటుంది.
అలాంటి దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమా ( Game changer movie )ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు గాను దర్శకుడు శంకర్ ఒక పాటను ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు చేసి చిత్రీకరిస్తున్నాడట.ఇలాంటివి శంకర్ సినిమాల్లో చాలా కామన్ విషయం.
కనుక ఇలాంటి సినిమాల్లో భారీ బడ్జెట్ పాటలు ఉండటం కన్ఫర్మ్.ఈ సినిమా లో కూడా శంకర్ అలాంటిదే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు టార్గెట్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా( RRR movie ) లో హీరో గా నటించిన రామ్ చరణ్ సినిమా అవ్వడం తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.
కనుక ఈ సినిమా విషయం లో కూడా రికార్డ్ బ్రేకింగ్ అవ్వడం ఖాయం అంటున్నారు.
శంకర్ దృష్టి పెట్టాలే కానీ వెయ్యి కోట్ల వసూళ్లు పెద్ద కష్టం ఏమీ కాదు.కనుక అయిదు కోట్ల రూపాయల పాట ఈ సినిమాలో నార్మల్ అన్నట్లుగా కొందరు మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించే విధంగా దర్శకుడు శంకర్ సినిమా ను చాలా జాగ్రత్తగా తీయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
దిల్ రాజు( Dil Raju ) బ్యానర్ నుండి రాబోతున్న అతి భారీ చిత్రాల జాబితాలో ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.