తమిళ నాడు లో ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) మరియు ఇళయ తలపతి విజయ్ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఉంది అనే సంగతి అందరికీ తెలిసిందే.రికార్డ్స్ విషయం లో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి.కానీ ఇద్దరి మధ్య వృత్తి పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా సంబంధాలు పెద్దగా లేవని తెలుస్తుంది.‘జైలర్’ మూవీ( Jailer ) ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు రజినీకాంత్ డైరెక్టర్ నెల్సన్ గత చిత్రం ‘బీస్ట్’ గురించి మాట్లాడుతూ, సినిమా కాన్సెప్ట్ మొత్తం బాగానే ఉంది, కానీ నటీనటులు మాత్రం ఈ చిత్రానికి సెట్ అవ్వలేదు అంటూ కామెంట్స్ చెసాడు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మా హీరో ని అంటావా అంటూ రజినీకాంత్ పై విజయ్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.ఇంత పెద్ద వయస్సు మరియు అనుభవం పెట్టుకొని రజినీకాంత్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ వినిపించాయి.
అదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా విజయ్ ‘లియో’ చిత్రం9 LEO ) విడుదలకు ముందు ఆ సినిమా సక్సెస్ కావాలని మీడియా తో అంటాడు.అక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ, లియో చిత్రం కథ విజయ్ కంటే ముందుగా రజినీకాంత్ కి చెప్పాడట డైరెక్టర్ లోకేష్.లియో చిత్ర నిర్మాత లలిత్ కుమార్ రజినీకాంత్ ని కలవడానికి వెళ్ళినప్పుడు లియో మూవీ స్టోరీ గురించి చెప్తూ, ప్రతీ సన్నివేశాన్ని వివరించాడట రజినీకాంత్.
అప్పటికీ ఇంకా లియో చిత్రం ప్రారంభమే కాలేదు, ఈయనకి ప్రతీ సీన్ ఎలా తెలుగు అబ్బా అని అనుకున్నాడట నిర్మాత లలిత్ కుమార్.ఇక ‘జైలర్’ సినిమా విడుదలైన తర్వాత , ఆ చిత్రం లోని సన్నివేశాలను చూస్తే చాలా వరకు లోకేష్ కనకరాజ్ తనకి వినిపించిన సన్నివేశాలే కనిపించాయట.
అంటే లియో చిత్రం కోసం వాడాల్సిన సన్నివేశాలను ‘జైలర్’ కి వాడేశారు అన్నమాట.
అలా మంచి సన్నివేశాలన్నీ రజినీకాంత్ కాపీ కొట్టించాడని, అందుకే ‘లియో’ సినిమా( LEO movie ) సెకండ్ హాఫ్ విషయం లేని విధంగా మారిందని సోషల్ మీడియా లో విజయ్ ఫ్యాన్స్ రజినీకాంత్ పై ఆరోపణలు చేసారు , ఇప్పటికీ ఈ విషయం గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి.విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాని అని చెప్పినప్పటి నుండి రజినీకాంత్ ఇలా ప్రవర్తిస్తున్నాడని, ఆయన కళ్ళ ముందే విజయ్ తనకి మించిన స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడని, తానూ చెయ్యలేని పనులు కూడా విజయ్ చేస్తున్నాడు కాబట్టి రజీనీకాంత్ లో అసూయ మొదలైంది అని అంటున్నారు.