ఎన్నో కలలతో రీసెంట్ గా లండన్‌కు( London ) వెళ్లిన భారతీయ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసింది.ఆదివారం సౌత్ లండన్‌లోని ఓ ఇంట్లో ఆమె శవమై తేలింది.
ఈ భారతీయ యువతిని కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు.ఈ దుర్ఘటన గురించి తెలిసిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
చాలా త్వరగా దర్యాప్తు చేసి ఆమెకు తెలిసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎందుకంటే ఈ యువకుడు అదే స్థలంలో గాయపడ్డాడు.
చనిపోయిన భారతీయ యువతి( Indian girl ) వయస్సు 19 సంవత్సరాలు, ఆమె ఇటీవలే భారతదేశం నుంచి యూకేకి వెళ్లింది.పోలీసులు ఆమె పేరును వెల్లడించలేదు, అయితే వారు ఆమె కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు.
హంతకుడి వయస్సు 23 ఏళ్లు, అతడి తలకు చిన్న గాయమైంది.అతడిని ఆసుపత్రికి తరలించి హత్య చేసినందుకు అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మరెవరి కోసం వెతకడం లేదని పోలీసులు తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం సౌత్ లండన్‌లోని క్రోయిడాన్ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది.ఓ ఇంట్లో యువతి చనిపోయిందన్న సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు.కత్తిపోట్లతో ఉన్న యువతిని గుర్తించిన వారు సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ప్రకటించారు.
శవపరీక్ష తర్వాత చేస్తామని మెట్రోపాలిటన్ పోలీసు ప్రతినిధి తెలిపారు.హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రేమ వ్యవహారమా లేదంటే లైంగిక బెదిరింపులకు హంతకుడు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.భారతీయ యువతి లండన్ కు చదువు నిమిత్తం వెళ్లిందా? అనేది తెలియ రాలేదు.