సినిమాలను తీయడం ఈమద్య పెద్ద కష్టం కావడం లేదు.కాని వాటిని విడుదల చేయడం చాలా పెద్ద కష్టం అవుతుంది.
ముఖ్యంగా చిన్న సినిమాలను విడుదల చేయడం అనేది చాలా పెద్ద ప్రహసనం అవుతుంది.అయితే కంటెంట్ ఉన్న సినిమాలను సురేష్‌బాబు వంటి స్టార్ నిర్మాతలు లిఫ్ట్ చేస్తున్నారు.
అలా సురేష్‌బాబుతో ప్రశంసలు పొంది ఆయన మద్దతు దక్కించుకున్న సినిమా ‘రాజావారు రాణిగారు’.ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఒక క్యూట్ లవ్ స్టోరీ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉన్న ఈ సినిమా నేడు విడుదల అయ్యింది.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ : రాజా(కిరణ్ అబ్బవరం) స్నేహితులతో కలిసి కాలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఆ సమయంలోనే రాణి(రహస్య గోకర్)ను ప్రేమిస్తాడు.
అయితే తన ప్రేమను చెప్పేందుకు ధైర్యం చేయడు.స్నేహితులు ఎంతగా చెప్పాలంటూ ఒత్తిడి చేసినా మరియు అతడికి చాలా ప్రేమ ఉన్నా కూడా భయంతో చెప్పేందుకు సాహసం చేయడు.
అలా వన్ సైడ్ లవ్ చేస్తున్న రాజా ప్రేమలో ట్విస్ట్ వస్తుంది.ఆ ట్విస్ట్ ఏంటీ? ఇంతకు రాజా చివరికి అయినా రాణికి ప్రేమను చెప్పి ఒప్పించాడా అనేది సినిమాను చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన : హీరోగా నటించిన కిరణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.ఒక భయపడే ప్రేమికుడి పాత్రలో అతడి నటన బాగుంది.
మొదటి నుండి చివరి వరకు చాలా క్యూట్‌గా అతడి యాక్టింగ్ ఉంది.ఇక హీరోయిన్ విషయంను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
పక్కింటి అమ్మాయిలా అనిపించడంతో పాటు చాలా సహజంగా రాణి పాత్రలో రహస్య గోకర్ నటించింది.ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు.
అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించింది.ఇక సినిమాలోని ఇతర నటీనటులు అంతా కూడా కొత్త వారే.
అయినా కూడా వారు మంచి నటనతో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్ : జయ్ క్రిష్ సంగీతం యావరేజ్‌గా ఉంది.ఒకటి రెండు పాటలు సందర్బానుసారంగా ఉండి మెప్పించాయి.ముఖ్యంగా మెలోడీతో ఆకట్టుకున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.ఇక పల్లె అందాలను చక్కగా చూపించడంలో సినిమాటోగ్రఫీ సూపర్ హిట్ అయ్యింది.
పల్లెటూర్లను గతంలో ఎన్నో సినిమాల్లో చూపించారు.అయినా కూడా ఇంకా ఎన్నో కొత్త అంశాలు పల్లెల్లో ఉంటాయి.
వాటిని చక్కగా సినిమాటోగ్రాఫర్ కవర్ చేశాడు.కొన్ని సీన్స్ సాగతీసినట్లుగా ఉన్నాయి.
ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.స్క్రీన్‌ప్లే బాగుంది.
కాస్త స్పీడ్‌గా స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే ఇంకా బాగుండేది.ఇక సినిమాను దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకుంది.
కథానుసారంగా నిర్మాణాత్మక విలువలు ఉన్నాయి.
విశ్లేషణ : ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందని చెప్పుకోవచ్చు.ఒక చిన్న సింపుల్ సినిమా అయినా ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో రూపొందింది.నటీనటుల కంటే కథ మరియు కథనం బలంగా ఉండటంతో సినిమాను జనాలు ఆధరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఈమద్య బాగానే నడుస్తున్నాయి.
కనుక ఈ సినిమా కూడా నడుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఇక ఈ సినిమాలో కథను నమ్మిన సురేష్‌బాబు సినిమాపై అంచనాలు పెంచాడు.
రాజా వారి రాణిగారి లవ్ స్టోరీ ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ : కథ, స్క్రీన్‌ప్లే, హీరో హీరోయిన్, కాలేజ్ సీన్స్
మైనస్ పాయింట్స్ : పాటలు, కొన్ని సీన్స్ ల్యాగ్ చేసినట్లుగా ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం
బోటమ్ లైన్ : సింపుల్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో నడిచి ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.75/5.0