నార్వేలో భార్యతో కలిసి మగధీర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న రాజమౌళి.. ఫోటో వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి( Rajamouli ) ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie) తో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు ( Mahesh Babu ) తో సినిమా చేయబోతున్నారు.

 Rajamouli Reminiscing About Magadheera With His Wife In Norway Photo Goes Viral,-TeluguStop.com

అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ పనులలో ఉంది దీంతో ఈయన పలు ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా ఫ్యామిలీతో కలిసి గత కొద్దిరోజులుగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినటువంటి రాజమౌళి తాజాగా తన భార్య రమా రాజమౌళి( Rama Rajamouli ) తో కలిసి నార్వే వెళ్లారు.

Telugu Magadheera, Norway, Rajamouli, Rama Rajamouli, Rrr-Movie

ఈ క్రమంలోనే అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎత్తైన కొండల ప్రదేశంలో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి రాజమౌళి మగధీర సినిమా( Magadheera ) జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు అయితే మగధీర సినిమా షూటింగ్ చేసే సమయంలో లొకేషన్స్ కోసం వెతుకుతున్న సమయంలో ఈ పల్పిట్ రాక్ చిత్రాలను చూసానని అప్పటినుంచి తాను ఇక్కడికి రావాలనుకుంటూ ఉన్నట్లు రాజమౌళి ఈ సందర్భంగా తెలియజేశారు.

Telugu Magadheera, Norway, Rajamouli, Rama Rajamouli, Rrr-Movie

ఇలా ఈ పల్పిట్ రాక్ ప్రదేశంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో తన తదుపరి సినిమాని ప్రారంభించబోతున్నారు.మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మహేష్ భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ తనని తాను సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube