నార్వేలో భార్యతో కలిసి మగధీర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న రాజమౌళి.. ఫోటో వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్.

ఎస్.రాజమౌళి( Rajamouli ) ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie) తో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు ( Mahesh Babu ) తో సినిమా చేయబోతున్నారు.

అయితే ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ పనులలో ఉంది దీంతో ఈయన పలు ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలా ఫ్యామిలీతో కలిసి గత కొద్దిరోజులుగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినటువంటి రాజమౌళి తాజాగా తన భార్య రమా రాజమౌళి( Rama Rajamouli ) తో కలిసి నార్వే వెళ్లారు.

"""/" / ఈ క్రమంలోనే అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎత్తైన కొండల ప్రదేశంలో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి రాజమౌళి మగధీర సినిమా( Magadheera ) జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు అయితే మగధీర సినిమా షూటింగ్ చేసే సమయంలో లొకేషన్స్ కోసం వెతుకుతున్న సమయంలో ఈ పల్పిట్ రాక్ చిత్రాలను చూసానని అప్పటినుంచి తాను ఇక్కడికి రావాలనుకుంటూ ఉన్నట్లు రాజమౌళి ఈ సందర్భంగా తెలియజేశారు.

"""/" / ఇలా ఈ పల్పిట్ రాక్ ప్రదేశంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో తన తదుపరి సినిమాని ప్రారంభించబోతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మహేష్ భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ తనని తాను సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!