కొత్త సినిమా రిలీజ్... ఒకప్పటి ఆ జోరు, క్రేజ్ ఎక్కడ ఎర్రన్న?

కొన్ని సంవత్సరాల క్రితం ఆర్‌ నారాయణ మూర్తి( R narayana murthy ) సినిమాలు వస్తున్నాయి అంటే ఒక వర్గం ప్రేక్షకులు చొక్కాలు చింపుకుని మరీ సినిమాను చూసేందుకు కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసేవారు.ఆయన కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ప్రజా ఉద్యమ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు.

 R Narayana Murthy New Movie University Release Today , R Narayana Murthy , Uni-TeluguStop.com

ఎన్నో కమర్షియల్‌ పాత్రలకు ఆయన్ను కొందరు దర్శకులు ఎంపిక చేసుకున్నా కూడా నో చెప్పాడు.లక్షల రూపాయల పారితోషికం కి నో చెప్పి మరీ తన ఉద్యమ పంథా సినిమా లనే మాత్రమే చేస్తూ వచ్చిన ఆర్‌ నారాయణ మూర్తి ఈ మధ్య కాలంలో సైలెంట్‌ గా ఉంటున్నాడు.

ఆయన సింప్లిసిటీకి ఈ తరం ప్రేక్షకులు కూడా నోరు వెళ్లబెడుతూ ఉంటారు.అలాంటి ఆర్ నారాయణ మూర్తి అలియాస్ ఎర్రన్న ఎట్టకేలకు ‘యూనివర్శిటీ పేపర్‌ లీక్‌’( University Paper Leak Movie ) అనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

Telugu Erranna, Yana Murthi, Telugu, Tollywood, Paper Leak-Movie

నేడు విడుదల అయిన ఈ సినిమా ను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.జనాలకు సంబంధించిన విషయం.ఉద్యమ నేపథ్యం ఉన్న సినిమా అయినా కూడా ఒకప్పుడు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.అప్పుడు నారాయణ మూర్తి సినిమా వస్తుంది అంటే ఓ రేంజ్ లో చర్చ.

మీడియా కవరేజ్ ఉండేది.కానీ ఇప్పుడు అంత బజ్ లేదు.

అంత క్రేజ్ కనిపించడం లేదు.మొత్తానికి ఈ సినిమా ఫలితం మరియు ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే ఎర్రన్న అనే శకం ముగిసి పోయినట్లేనా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Telugu Erranna, Yana Murthi, Telugu, Tollywood, Paper Leak-Movie

గౌరవ ప్రధంగా ఎన్నో సినిమా లు చేసిన ఎర్రన్న ఇక అంతే గౌరవ ప్రథంగా సినిమాల నుంచి రిటైర్మెంట్‌ ను తీసుకుంటే మంచిది అన్న అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.ఆర్‌ నారాయణ మూర్తి అభిమానులు కొందరు అయినా యూనివర్శిటీ పేపర్ లీక్ సినిమాను చూసి వారి అభిప్రాయంను సోషల్‌ మీడియా( Social media )లో షేర్‌ చేసుకుంటారేమో.దాన్ని బట్టి సినిమా ఎలా ఉందో చూద్దాం అన్నట్లుగా కొందరు ఎదురు చూస్తున్నారు.మరి పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లు నమోదు అయ్యేనా చూడాలి.ఎప్పటిలాగే ఈ సినిమాకు కూడా సర్వం తానే అయ్యి నారాయణ మూర్తి ఈ సినిమాను రూపొందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube