సామాజిక వేత్త ప్రముఖ హీరో.సినిమా నటుడు అయిన ఆర్.
నారాయణ మూర్తి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ ఒక వార్తా హల్చల్ చేస్తోంది…ఏపీలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్.నారాయణ మూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ వైసీపీ లకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న జనసేన పార్టీ లోకి నారాయణ మూర్తి వెళ్లనున్నారు అని టాక్.అయితే గతంలో అనేకమంది హీరోలు సినిమా యాక్టర్స్ జనసేనలోకి వెళ్లనున్నారని టాక్ వచ్చింది.
అయితే ఎంతో సామాజిక స్పృహ ఉన్న నారాయణ మూర్తి కూడా ఇప్పుడు పవన్ పార్టీ లోకి వెళ్తున్నారనే వార్తలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లొనే కాక.రాజకీయ వర్గాలలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. గతంలో నటుడు అలీ నుంచీ బ్రహ్మానందం వరకూ.సంపూర్నేష్ బాబు ,హీరో శ్రీకాంత్ ఇలా ఎంతో మంది జనసేన లోకి వెళ్తున్నారు అంటూ అనేక వార్త కధనాలు వచ్చాయి.
హీరో శ్రీకాంత్ ఈ వార్తలని ఖండిడించిన మిగిలిన వారు ఎవరు కూడా ఈ వార్తలపై స్పందించలేదు.అయితే తాజాగా నారాయణ మూర్తి వార్త ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
నారాయణ మూర్తి ఎంట్రీ జనసేన లో చేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి.అనే విషయం ఎంతో చర్చించుకున్న తరువాతనే పవన్ నారాయణ మూర్తి వద్ద ఈ ప్రతిపాదన ఉంచారు అని టాక్.
అయితే స్వయంగా పవన్ ఆయనకి ఆహ్వానం పలకడం వెనుక అసలు రీజన్ ఏంటంటే.
సామాజిక స్పృహ.
బడుగుల కోసం ఆయన పడే తపన.సమాజంలో ఉండే అన్యాయాన్ని తనదైన శైలిలో చూపిస్తూ దానిని సమర్ధవంతంగా ఎదుర్కోవడం…అంతకు మించి గతంలోనే తెలుగుదేశం పార్టీ నుంచీ,కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని వచ్చిన ఆఫర్లు ఇలా ఆయన వ్యక్తి త్వాన్ని మరింతగా పెంచాయి.పవన కూడా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లే కావాలని అనుకోవడంతో ఆయన జిల్లా లో ఎక్కడ పోటీ చేసినా గెలుపు ఖాయం అని తేలడంతో స్వయంగా పవన్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానం ఇచ్చారట….ఈ విషయంలో అప్పటి కప్పుడు చెప్పక పోయినా సరే అలోచించి చెప్తానని అన్నారని టాక్ వినిపిస్తోంది.