స్టైలీష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్.( Allu Arjun ) ఈయన హీరోగా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించింది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ భారీ లెవెల్లో పెంచుకున్నడనే చెప్పాలి.ఇప్పుడు ఆయన పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో మరింత ముందుకు రావాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఇండియా మొత్తం ఒకటే చర్చ జరుగుతుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో చేయడం అనేది ఒక రికార్డు అనే చెప్పాలి.ఇక పుష్ప 2 సినిమా అత్యధికంగా 500 కోట్ల వరకు బిజినెస్ చేయడం అనేది ఇప్పుడు ఒక రికార్డుగా నెలకొంది.ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉండబోతుందట.అయితే ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది సస్పెన్స్ గా పెట్టి సినిమా ఇంటర్వెల్ లో రివీల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆ హీరోయిన్ ఎవరు అంటే బాలీవుడ్ లో ( Bollywood ) స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఒక హీరోయిన్ ని ఈ సినిమాలో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
అయితే హీరోయిన్ ఉంది అనే సమాచారం అయితే అందుతుంది కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం క్లారిటీగా చెప్పడం లేదు.అయితే డైరెక్ట్ గా సినిమా థియేటర్లోనే ఆ హీరోయిన్ రివిల్ చేయాలని చూస్తున్నారట.ఈ సినిమాతో కనక సూపర్ హిట్ అయితే అల్లు అర్జున్ సూపర్ స్టార్ అవుతాడు.
ఇక అతన్ని మించిన హీరో మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం శక్తి లేదు…