క్యూట్‌ 'పూరి' ఇన్‌స్టాగ్రామ్‌ లొల్లి

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ కొడుకు మరియు కూతురు ఆకాష్‌ ఇంకా పవిత్రలు చిన్నప్పటి నుండే ప్రేక్షకులకు సుపరిచితం.పలు సినిమాల్లో ఇద్దరు కూడా నటించారు.

 Purijaganath Daughter Delete The Instagram Account, Puri Jaganath , Pavitra, Aka-TeluguStop.com

పవిత్ర పలు సినిమాలో బాల నటిగా నటించి మెప్పించింది.ప్రస్తుతం ఆకాష్‌ పూరి హీరోగా సినిమాలు చేస్తుండగా పవిత్ర చదువుతోంది.

ఆమె నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నట్లుగా ఇటీవల పూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.పవిత్ర సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్‌ స్టా గ్రామ్‌ లో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది.

పూరి జగన్నాద్‌ కూతురు అవ్వడం వల్ల ఆమెకు ఇన్‌ స్టాలో లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.ఈమధ్య కాలంలో ఇన్‌ స్టా ఫాలోవర్స్‌ ను బట్టి వారి స్టార్‌ డంను నిర్ణయిస్తున్నారు.

ఈ ఫాలోవర్స్‌ ను బట్టి చూస్తుంటే ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉందని చెప్పుకోవచ్చు.అంతగా ఫాలోయింగ్‌ ఉన్న ఈమె తన అకౌంట్‌ ను డిలీట్‌ చేసేందుకు సిద్దం అవుతుందట.

తాజాగా పవిత్ర మరో ఇన్‌ స్టా అకౌంట్‌ ను ఓపెన్‌ చేసింది.అందులో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెడుతోంది.

ఉన్నట్లుండి పాత ఇన్‌ స్టా అకౌంట్‌ ను ఆమె వదిలేయడానికి కారణం ఏంటో అంటూ ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది.ఆ అకౌంట్‌ తో పదే పదే సాంకేతిక సమస్య రావడంతో పాటు ఆ అకౌంట్‌ లో తనకు సంబంధించిన విషయాలు సరిగా లేవనే ఉద్దేశ్యంతో పవిత్ర కొత్త అకౌంట్‌ను మొదలు పెట్టిందట.

అయితే కొత్త అకౌంట్‌ ను అందరు ఫాలో అయ్యే వరకు తాను కొత్త అకౌంట్‌ను ఓపెన్‌ చేసిన విషయం అందరికి తెలిసే వరకు కూడా పాత అకౌంట్‌ ను ఉంచి ఆ తర్వాత డిలీట్‌ చేస్తానంటోంది.దాంతో అక్కడ ఆమె గురించి వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.

అసలు విషయం ఏంటో మాత్రం పవిత్ర తేల్చి చెప్పలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube