ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 Cm Jagan Good News To Ap Unemployees, Ap Cm Jagan, Ysrcp, Grama Ward Volunters,-TeluguStop.com

కరోనా కష్ట కాలంలో జగన్ సర్కార్ కొన్ని నెలల క్రితమే 16,208 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేయగా తాజాగా 1,036 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను జగన్ సర్కార్ భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది.నెల్లూరు జిల్లాలో 273, చిత్తూరు జిల్లాలో 374, గుంటూరు జిల్లాలో 239, శ్రీకాకుళం జిల్లాలో 85, తూర్పు గోదావరి జిల్లాలో 65 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

పదో తరగతి విద్యార్హతతో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.శ్రీకాకుళం, నెల్లూరు అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలి.తూర్పు గోదావరి, చిత్తూరు అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోపు, గుంటూరు జిల్లా అభ్యర్థులు మాత్రం సెప్టెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

వైసీపీ పథకాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube