ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం తొలి మీడియా సమావేశం నిర్వహించిన ఆమె వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు.పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్నాయని తెలిపారు.
అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి బీజేపీ న్యాయం చేసిందన్నారు.
ఏపీకి 22 లక్షలకు పైగా ఇళ్లను కేంద్రం ఇచ్చిందన్న పురంధేశ్వరి ఏపీలో ప్రస్తుత రహదారుల అభివృద్ధి బీజేపీ చలవేనని వెల్లడించారు.