ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా( Social media ) దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా సరికొత్త ఫ్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తెచ్చింది.అదే థ్రెడ్స్.
ట్విట్టర్ తరహాలోనే ఉండే ఈ ఫ్లాట్ ఫామ్ కు భారీగా యూజర్లు వస్తున్నారు.ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే మిలియన్ల మంది యూజర్లు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు.
అయితే థ్రెడ్స్ ఫ్లాట్‌ఫామ్ ఇంత పాపులర్ అవ్వడానికి ట్విట్టర్ ఛైర్మన్ ఎలాన్ మాస్క్ తీసుకునే నిర్ణయాలు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్( Elon Musk ) తీసుకున్న తర్వాత అనేక కొత్త నిర్ణయాలు తీసుకున్నారు.ఉద్యోగులను తొలగించడంతో పాటు ఫ్లాట్‌ఫామ్‌లో కూడా అనేక మార్పులు చేశారు.ఇంతకుముందు బ్లూటిక్ ఉచితంగా లభించేది.
కానీ ఇప్పుడు బ్లూటిక్ కావాలంటే డబ్బులు చెల్లించేలా కొత్త విధానం తీసుకొచ్చారు.ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సబ్‌స్క్రిప్షన్ తరహాలో బ్లూటిక్ కావాలంటే ఏడాదికి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీ చెల్లించాలి.
లేకపోతే బ్లూటిక్ మాయమైపోతుంది.అలాగే ట్వీట్ల మీద ఆంక్షలు పెట్టారు.
ఎలన్ మస్క్ పెట్టిన ఆంక్షలు ట్విట్టర్ ( Twitter) యూజర్లకు ఆగ్రహం తెప్పించాయి.ఈ క్రమంలో ట్విట్టర్ ను పోలిన థ్రెడ్స్ యాప్ రావడంతో దానివైపు అందరూ మొగ్గు చూపుతారు.అలాగే ట్విట్టర్ తో పోలిస్తే థ్రెడ్స్ లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.ఎక్కువ నిడివిగల వీడియోలను పబ్లిష్ చేసుకోవడంతో పాటు కంటెంట్ ఎక్కువ పోస్ట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
దీంతో పాటు ట్విట్టర్ తో పోలిస్తే డిజైన్, ఫీచర్లు బాగుండటంతో ఈ ఫ్లాట్ ఫామ్ వైపు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.ఏది ఏమైనా ఎలాన్ మస్క్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కఠిన నిర్ణయాలే ట్విట్టర్ ను నాశనం చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.