ప్రముఖ నటుడు పునీత్ రాజ్ కుమార్( Puneeth Rajkumar ) మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది.పునీత్ రాజ్ కుమార్ మరణించి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది.
పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా మరణించినా అభిమానుల హృదయాల్లో పునీత్ రాజ్ కుమార్ నిలిచిపోయారు.మా గుండెల్లో ఎప్పటికీ ఉంటావ్ పునీత్ రాజ్ కుమార్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పునీత్ రాజ్ కుమార్ ను అభిమానులు ప్రేమగా అప్పూ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే.
పునీత్ రాజ్ కుమార్ ఒకవైపు సినిమాలలో నటించడంతో పాటు మరోవైపు సామాజిక కార్యక్రమాలను( Puneeth Rajkumar Social Activities) నిర్వహించారు.పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందనే సంగతి తెలిసిందే.పునీత్ రాజ్ కుమార్ రెండో వర్ధంతి కావడంతో ఆయన అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు.
కంఠీర స్టూడియోలోని అప్పు స్మారకన్ని( Appu Kanteerava Studio ) పూలతో అలంకరించడంతో పాటు ఈరోజు అప్పు సంస్మరణ సభ జరుగుతోందని తెలుస్తోంది.పునీత్ రాజ్ కుమార్ సమాధిని తెల్లటి పాలరాతితో నిర్మించడం గమనార్హం.
పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్( Shiva Rajkumar ) దగ్గరుండి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు.పునీత్ సమాధి దగ్గర పూజలు చేయడానికి ఎక్కువ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.
అభిమానులు మాట్లాడుతూ అప్పా ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటాడని అన్నారు.జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒక సందర్భంలో పునీత్ గురించి చెప్పిన విషయాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.పునీత్ లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా దానం చేసే మంచి గుణం మాత్రం కొందరికే ఉంటుంది.
ఆ కొందరిలో పునీత్ రాజ్ కుమార్ ముందువరసలో ఉంటారు.