శుక్రవారం వచ్చింది అంటే చాలు ఐమాక్స్ థియేటర్స్ వద్ద లక్ష్మణ్ రివ్యూ కోసం వందలాదిగా మైకులు ఎదురు చూస్తూ ఉంటాయి.అసలు ఈ లక్ష్మణ్ ఎవరు అనుకుంటున్నారా అదేనండీ లక్ష్మణ్ టేకుమూడి.
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఒకటే విధంగా సినిమా అద్భుతం అన్నట్టుగా రివ్యూ ఇస్తుంటాడు.అయితే లక్ష్యణ్ తన మనసులోని మాటను బయట చెబుతాడా? లేకపోతే ఇలా రివ్యూ చెప్పడానికి సినిమాకు ఎంత తీసుకుంటాడు? అతనికి ఇదే పనా?లేకుంటే వేరే ఏమన్నా పని చేస్తుంటాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకులు మధ్యలో తలెత్తుతున్నాయి.లక్ష్యణ్ ఎవరు? ఏమిటి? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లక్ష్మణ్ వైజాగ్ కు చెందిన వాడు.
అతడికి తమ్ముడు చెల్లి, అమ్మా,నాన్న, నానమ్మ ఉన్నారు.చిన్న చిన్న గొడవలు వల్ల అతడు ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు.
అలా ఇంటి నుంచి వచ్చిన తర్వాత లక్ష్మణ్ పనికి వెళ్లేవాడట.అలా లక్ష్మణ్ చేయని పని అంటూ ఏదీ లేదని తెలిపాడు.
ఆ తరువాత లక్ష్మణ్ వాళ్ల మామయ్య హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి అక్కడికి రమ్మని అనడంతో అక్కడికి వెళ్లి సినిమాలు చూడటం మొదలుపెట్టాడు.అయితే అతను వైజాగ్ లో సినిమా చూసి వస్తున్న క్రమంలో సినిమాకి వెళ్ళిన ప్రతి సారి బయట మైకులు పెట్టి సినిమా ఎలా ఉంది అని రివ్యూ అడిగే వారట.
అలా అతడు రెండు మూడు సార్లు సినిమా పై తన అభిప్రాయం చెప్పాడట.
అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా చెప్పాలి అని అనుకొని డిఫరెంట్ గా ట్రై చేయడంతో అదికాస్తా వర్కౌట్ అయ్యి కంటిన్యూ చేస్తున్నాడట.ఇలా రివ్యూ చెప్తున్నారని ఇంట్లో తెలియడంతో ఇంట్లో నుంచి ఫోన్లు చేసి ఏంట్రా ఇది అని అడిగారట.ఆ తర్వాత కూడా తన ఫ్యామిలీ అర్థం చేసుకున్నారట.
అయితే ఈ మధ్య కాలంలో అతడు చాలా మంది డైరెక్టర్ లను కలిశానని, వారు అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చారని, త్వరలోనే రివ్యూ చెప్పుకోవాలి అదే నా కల అని తెలిపాడు లక్ష్మణ్.ఇకపోతే రివ్యూలు చెబుతున్నందుకు చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెడతారు, తిడతారు వాటిని పెద్దగా పట్టించుకోను.
వారు పెట్టే ఆ బూతులే నాకు బూస్టింగ్ అని తెలిపాడు.ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఈ అవమానాలు భరించాలి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడట.ఆ తర్వాత నిదానంగా మంచి మంచి అవకాశాలు వస్తుండటంతో, ఇలా కష్టాల్ని భర్తిస్తున్నారు.నాకు అవకాశం వస్తే తప్పకుండా నేను నిరూపించుకుంటానని తెలిపాడు.అలాగే సినిమాల రివ్యూ చెప్పడానికి డబ్బులు తీసుకుంటున్న అంటున్నారు.అందులో వాస్తవం లేదు అని తెలిపాడు.
అలాగే ప్రతి శుక్రవారం కూడా సినిమా చూడాలి, ఇదే నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి అని తెలిపాడు లక్ష్మణ్.