సిరిసిల్లలో ఓ సైకో పిఈటి - రోడ్డు ఎక్కిన విద్యార్థులు

సిరిసిల్లలో ఓ సైకో పీఈటీ హద్దులు దాటి ప్రవర్తిస్తోందని, ఆమె వేధింపులు తట్టుకోలకే పాఠశాల, కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.వివరాల్లోకి వెళితే జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో జోష్ణ పీఈటీ విధులు నిర్వర్తిస్తోంది.

 Psycho Pet In Sirisilla Students Protest, Psycho Pet ,sirisilla ,students Protes-TeluguStop.com

ఈ క్రమంలో ఆమె తమ పట్ల అరాచకంగా ప్రవర్తిస్తోందని, గురువారం ఉదయం 5 గంటల సమయంలో విద్యార్థులు సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న పీఈటీ జ్నోస్న సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.పీఈటీ జ్నోస్న తమను ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ, ఎక్కడ పడితే అక్కడ కొడుతుందని మండిపడ్డారు.

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే గురువే.బూతులు మాట్లాడితే ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి.ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు.తన క్లాస్ సమయంలో కూడా వేధిస్తోందని, స్నానం చేస్తుంటే బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ, రక్తం వచ్చేలా కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నిసార్లు ప్రిన్సిపల్‌తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.580 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల, కళాశాలలో కనీస వసతులు కూడా లేవని అన్నారు.ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎంఈవో, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పినా నిరసన విరమించేందుకు వారు ఒప్పుకోలేదు.దీంతో ఎంఈవో రఘుపతి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్న పీఈటీ జ్నోస్నను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube