వైరల్: మహిషాసురిడిగా ప్రధాని పోస్టర్... మరి దుర్గాదేవిగా పోస్టర్ లో ఉన్నది ఎవరంటే..?!

పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చెసిన ఒక పోస్టర్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతుంది.ఈ పోస్టర్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది.

 Prime Minister Poster As Mahishasura And Who Is In The Poster As Durgadevi ,-TeluguStop.com

ఈ పోస్టర్ లో మన ప్రధాని నరేంద్ర మోడీని మహిషాసురుడిగా చూపించగా రాక్షసులను సంహరించే దుర్గామాతగా బెంగాల్ సీఎం అయిన మమత బెనర్జి ఫోటోను పెట్టారు.అసలు వివరాల్లోకి వెళితే.

పశ్చిమ బెంగాల్ లోని మదనాపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు రాజకీయంగా అక్కడ కలకలం రేపుతోంది.ఏకంగా మన భారతదేశ ప్రధాని మోడీని మహిషాసురుడిగా, రాక్షసులను సంహరించే దుర్గాదేవి మాతగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఉన్నారు.

ప్రస్తుతం ఇప్పుడు బెంగాల్ లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఈ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.అయితే ఈ పోస్టర్ ను మదనాపూర్ జిల్లాలో మిడ్నాపూర్ లో తృణమూల్ పార్టీ అభ్యర్థి అనిమా సాహా ఈ ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది.

కానీ ఈ పోస్టర్ ఎవరు పెట్టారు అనే విషయం పట్ల ఇంకా క్లారిటీ రాలేదు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

బెంగాల్ మొత్తం ఇప్పుడు ఈ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది.అంతే కాకుండా మోడీ, మమతా బెనర్జీ ముఖ చిత్రాలతో పాటు ఎవరైనా ప్రతిపక్ష పార్టీకి అంటే పరోక్షంగా బీజేపీకి ఓటు వేస్తే వారు బలి అవుతారని చెప్పకనే చెబుతున్నట్లు ఉంది ఈ పోస్టర్లో.

అలాగే ఆ పోస్టర్ లో మిగిలిన పార్టీలను మేకలుగా చూపిస్తూ వాళ్ళను బలి పశువులుగా పేర్కొన్నారు.అంతే కాకుండా ఎవరైనా వారికి ఓటేస్తే వారిని బలివ్వడం జరుగుతుంది అంటూ కింద నోట్ కూడా రాసారు.అలాగే ఒక్క మోదీనే కాకుండా అమిత్ షాను కూడా రాక్షసుడిలాగా చూపించారు.దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య అసహనం వ్యక్తం చేసారు.ఈ ఘటన పట్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.కాగా ఆ పోస్టర్ ఎలా వచ్చిందన్న విషయం కూడా తనకు తెలియదని అనిమా సాహా చెబుతున్నారు.

త్వరలోనే ఈ పోస్టర్ ఎవరు పెట్టారో అనే విషయం తెలుసుకుంటామని అధికారులు అంటున్నారు.

Prime Minister Poster As Mahishasura And Who Is In The Poster As Durgadevi , Mamata Banerjee , Durga, PM Modi , Poster , Mahishasura , Viral Latest , News Viral , Social Media ,Prime Minister Narendra Modi - Telugu Durga, Mahishasur, Mamata Banerjee, Pm Modi, Poster, Primenarendra, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube