భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.పర్యటన నేపథ్యంలో ముందుగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ముర్ము శ్రీశైలం వెళ్లనున్నారు.ఉదయం 11.15 గంటలకు సున్నిపెంట చేరుకోనున్న ముర్ము మధ్యాహ్నం 12.05 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళ్లనున్నారు.
శ్రీశైలం ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించనున్నారు.సమాచార కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆలయ చరిత్ర, ప్రసాద్ పథకం పనులకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముర్ము వీక్షించనున్నారు.మధ్యాహ్నం 2.45 గంటల వరకు శ్రీశైలంలో ఆమె పర్యటన కొనసాగనుందని అధికారులు తెలిపారు.అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ముకు సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలకనున్నారు.