కన్ఫం: రెండేళ్ల తరువాతే వస్తానంటోన్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని తన 20వ చిత్రాన్ని జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకోబట్టి చాలా రోజులవుతుంది.

 Prabhas, Prabhas 21, Nag Ashwin, Ashwini Dutt-TeluguStop.com

కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయలేదు.ఇదిలా ఉంటే, తన 21వ చిత్రాన్ని ఇటీవల ఓకే చేశాడు ప్రభాస్.

మహానటి వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో సూపర్ హీరో తరహా మూవీగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ 20వ చిత్రాన్ని త్వరగా పూర్తి చేస్తే ఈ సినిమాను ప్రారంభించాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు.

కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో దాని ప్రభావం ప్రభాస్ 21వ చిత్రంపై పడింది.ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాను ప్రారంభించి, వచ్చే ఏడాది చివరినాటికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను ఎంత త్వరగా పూర్తి చేసినా అనుకున్న ఔట్‌పుట్ రావడం కష్టమని, అందుకే ఈ సినిమాను 2022 సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని చిత్ర ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ తెలిపారు.ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి సూపర్ హీరో రోల్‌లో మనకు కనిపిస్తాడనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube