పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న(సెప్టెంబర్ 2) సోషల్ మీడియాలో పవన్ మేనియా ఎలా సాగిందో మనం చూశాం.పవన్ నటిస్తున్న పలు సినిమాల అప్‌డేట్లతో సోషల్ మీడియాను షేక్ చేశాడు పవర్ స్టార్.
ఇక పవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఇక ఈ టైటిల్ సాంగ్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుండగా, తెలంగాణ పోలీసుల మాత్రం ఈ పాటపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్రకు సంబంధించిన పాట కావడంతో పోలీస్ ఆఫీసర్‌గా పవన్ ఎలాంటి రచ్చ చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే ఈ టైటిల్ సాంగ్‌లో పోలీస్ ఆఫీసర్ అయిన పవన్ గూండాలను కొడితే వారి బొక్కలు విరిగిపోతాయని అర్ధం వచ్చేలా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.
దీంతో ఈ లిరిక్స్ అభ్యంతకరంగా ఉన్నాయంటూ తెలంగాణ పోలిసులు మండిపడుతున్నారు.ఈ మేరకు ఓ పోలీస్ అధికారి రామజోగయ్య శాస్త్రికి తెలుగులో పోలీసుల గురించి చెప్పేందుకు పదాలు దొరకలేదని, తాము ఇతరుల బొక్కలు విరిగేలా డ్యూటీలు ఏమీ చేయడం లేదని ఆ అధికారి వెల్లడించారు.
దీంతో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌లో పోలీసులను నెగెటివ్‌గా చూపిస్తున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ అంశంపై చిత్ర యూనిట్ ఎవరూ స్పందించలేదు.
మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుండగా, యూట్యూబ్‌లో భీమ్లా నాయక్ పాట అదరగొడుతుండటంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.మరి భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌పై రచయిత ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు పవన్ అండ్ టీమ్ ప్రయత్నిస్తున్నారు.