భారతదేశంలోని ప్రముఖ మొబైల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది.భారత ప్రభుత్వ ప్రోగ్రామ్ అయిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఆధారంగా పిన్‌కోడ్ అనే హైపర్‌లోకల్ కామర్స్ యాప్‌ను ప్రారంభించింది.
పిన్‌కోడ్ జీరో-కమీషన్ ప్లాట్‌ఫామ్‌ను అందించడం ద్వారా ఈ-కామర్స్ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చేయనుంది.న్యాయమైన పద్ధతుల్లో స్థానిక దుకాణాలతో కలిసి పని చేస్తుంది.
పిన్‌కోడ్ యాప్( Pincode app )ని మొదట బెంగళూరులో లాంచ్ చేస్తున్నారు.అయితే ఫోన్‌పే ఎగ్జిక్యూటివ్‌లు దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలని, 2023 చివరి నాటికి రోజుకు లక్ష ఆర్డర్‌లను సేకరించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి పిన్‌కోడ్ కిరాణా, మందులు, ఆహారం, ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ వంటి కేటగిరీలపై ఎక్కువగా దృష్టి పెడుతుంది.అంటే నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమంగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఇక ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) అనేది 2021లో భారతదేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ స్థాపించిన ఒక నాన్-ప్రాఫిట్ ఆర్గనైజషన్( Nonprofit organization ) ఇది ఇంటర్‌ఆపరబుల్ నెట్‌వర్క్.ఇది కొనుగోలుదారులు, విక్రేతలు వారు ఉపయోగించే సేవతో సంబంధం లేకుండా వ్యాపారం చేయడానికి అనుమతిస్తుంది.
ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాజమాన్య సేవలపై వినియోగదారులు ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
ONDCతో సైన్ అప్ చేసిన ఫోన్‌పే ఎత్తుగడ విశేషమైనది.ఎందుకంటే ఈ నెట్‌వర్క్‌ను ఇప్పటివరకు అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రధాన దిగ్గజాలు వినియోగించలేదు.2016లో ఫ్లిప్‌కార్ట్‌కి అమ్ముడైన ఫోన్‌పే( PhonePe ), గతేడాది ఆ ఈ-కామర్స్ దిగ్గజం నుంచి విడిపోయింది.ఫోన్‌పే ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ, ONDC ఈ-కామర్స్ రంగానికి గేమ్-ఛేంజర్ అని, డిజిటల్ షాపింగ్ గ్రోత్‌లో అన్ని స్థానిక స్టోర్లు, విక్రేతలను ఉంచడం ద్వారా పిన్‌కోడ్ ఈ-కామర్స్‌కు విప్లవాత్మక విధానాన్ని అందిస్తుందని చెప్పారు.అయితే ఈ యాప్ రాకతో ఇలాంటి ఇతర యాప్స్‌కి ఎదురు దెబ్బ తగులుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.