ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.11
సూర్యాస్తమయం: సాయంత్రం 06.26
రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 సా4.00 ల6.00
దుర్ముహూర్తం: ఉ.11.57 మ2.48
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:
ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు తొందరపడి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచన ఎంతో అవసరం.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.వాహనం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది.
సింహం:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను చేసేటప్పుడు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కన్య:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తులా:
ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
వృశ్చికం:
ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగా అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు:
ఈరోజు మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరు చేసే పనుల్లో కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది.
మకరం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
కుంభం:
ఈరోజు కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ తల్లిదండ్రులతో వాదనలకు దిగుతారు.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
మీనం:
ఈరోజు మీరు ప్రారంభించే పనుల్లో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు.మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది.ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
DEVOTIONAL