2వేల నోట్లు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? బ్యాంకులకు 58 రోజులు సెలవులన్న విషయం తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా( RBI ) రూ.2 వేల నోట్లను( Rs.2000 ) ఉపసంహరించుకున్న సంగతి అందరికీ తెలిసినదే.అయితే ఈ నోట్లు మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం వుంది కదాని ధీమా పడాల్సిన అవసరం లేదు.

 People Cant Exchange 2000 Notes With Banks Amid 58 Days Holidays Till September-TeluguStop.com

ఎందుకంటే ఈలోపు వున్న బ్యాంక్ సెలవుల గురించి( Bank Holidays ) ఇపుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.దాంతో ఇపుడు ఏ ఏ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పని చేయవో తెలుసుకుందాం.

Telugu Notes, Denominatios, Days Holidays, Bank Holidays, Exchange, Exchange Not

జూన్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. జూన్ 15న రాజా సంక్రాంతి, జూన్ 20న రథ యాత్ర, జూన్ 26న కరాచీ పూజ, జూన్ 28న బక్రీద్, జూన్ 29న బక్రీద్, ఈద్ ఉల్ జుహా జూన్ 30న వచ్చింది.అలాగే జూన్ నెలలో ఆది వారాలు ఎలాగూ సెలవే.ఇంకా రెండో శనివారం, నాలుగో శనివారం కూడా ఉన్నాయి.అలా మొత్తంగా జూన్ లో 12 రోజులు సెలవులు.అదేవిధంగా జూలై నెలను తీసుకుంటే ఏకంగా 15 రోజులు హాలిడేస్ కలవు.

జూలై 5న గురు హర్‌గోవింద్ జయంతి, జూన్ 6న ఎంహెచ్‌ఐపీ డే, జూలై 11న కేర్ పూజ, జూలై 13న భాను జయంతి, జూలై 17న యూ టిరోత్ సింగ్ డే, జూలై 21న ద్రుక్పా తేష్ జి, జూలై 28న అశూర, జూలై 29న మొహరం ఉన్నాయి.అంతేకాకుండా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలుపుకొని మొత్తం 15 రోజులు.

Telugu Notes, Denominatios, Days Holidays, Bank Holidays, Exchange, Exchange Not

అదేవిధంగా ఆగస్ట్ నెలలో 14 రోజులు సెలవులు కాగా… ఆగస్ట్ 8న టెన్‌దోంగ్ హో రమ్ ఫాట్, ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 16న పార్సి న్యూ ఇయర్, ఆగస్ట్ 18న తిథి ఆఫ్ శ్రీమంత శంకరదేవ, ఆగస్ట్ 28న ఫస్ట్ ఓనం, ఆగస్ట్ 29న తిరువోనం, ఆగస్ట్ 30న రక్షాబంధన్, ఆగస్ట్ 31న శ్రీ నారాయణ గురు జయంతి ఉండగా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలుపుకొని మొతం 14 రోజులు.ఇక ఆఖరిగా సెప్టెంబర్ నెలను పరిశీలిస్తే, సెప్టెంబర్ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 18, 19, 20న వినాయక చవితి, సెప్టెంబర్ 22న శ్రీ నారాయణ గురు సమాధి డే, సెప్టెంబర్ 23న మహరాజ హరి సింగ్ జి జయంతి, సెప్టెంబర్ 25న శ్రీమంత శంకరదేవ జన్మోత్సవ్, సెప్టెంబర్ 27న మిలాద్ ఐ షెరిప్, సెప్టెంబర్ 28న ఈద్ ఇ మిలాద్, సెప్టెంబర్ 29న ఇంద్రజత్ర కలుపుకొని ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం లెక్కేస్తే 17 రోజులు సెలవులు ఉన్నాయి.

గమనిక: అలా బ్యాంకులకు మొత్తం 58 రోజులు కాబట్టి అప్రమత్తం కండి.అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలమీద ఆధారపడతాయని గుర్తు పెట్టుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube