పాయల్‌ మూడేళ్లుగా ఇంత బాధను మనసులో పెట్టుకుందట.. కన్నీరు పెట్టించిన ఆమె సోదరుడి కథ     2019-01-21   09:12:28  IST  Sravani P

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఆర్‌ ఎక్స్‌ 100’ చిత్రంతో దూసుకు వచ్చిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రంలో చాలా బోల్డ్‌గా నటించి వావ్‌ అనిపించుకుంది. హీరోయిన్‌గా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను చేసేందుకు కమిట్‌ అయ్యి సంచలన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతటి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పూత్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయన్‌. కోలీవుడ్‌ లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన పాయల్‌ రాజ్‌ పూత్‌ మనసులో చాలా బాధ ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆమె సోదరుడు కనిపించకుండా పోయాడు. అతడు ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడనే విషయం తెలుసుకునేందుకు మూడు సంవత్సరాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉందట. కుటుంబ సభ్యులు ప్రతి రోజు కూడా పాయల్‌ సోదరుడు దృవ్‌ కోసం ఎదురు చూస్తున్నారట. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశామని, మూడు సంవత్సరాలుగా అన్నయ్య ఎక్కడ ఉన్నది జాడ తెలియడం లేదని హృదయాలను పిండేసేలా పాయల్‌ పోస్ట్‌ చేసింది.

Payal Rajput Emotional Tweet About Her Brother-Missing Payal Brother Dhruv Three Years

Payal Rajput Emotional Tweet About Her Brother

అన్నయ్య హ్యాపీ బర్త్‌డే, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క సందేశం ఇవ్వు, ఎక్కడైనా నువ్వు రాలేని ప్రాంతంలో ఉంటే మాత్రం చిన్న ఇన్ఫర్మేషన్‌ ఇవ్వు. నీ కోసం మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో సార్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి నీ గురించి ఏమైనా విషయం తెలిసిందా అంటూ అడిగాం. కాని వారు ప్రతి సారి కూడా జాడ తెలియలేదు అన్నారు. ఈ సందేశం కనుక నీవు చూస్తే వెంటనే స్పందించు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు నీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ పాయల్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేసింది. పాయల్‌ తన సోదరుడి ఫొటోలను షేర్‌ చేయడంతో ఆమె ఫాలోవర్స్‌ ఆ పోస్ట్‌ను రీ ట్వీట్‌ చేయడంతో పాటు, ఆ ఫొటోను తెగ షేర్‌ చేస్తూ ఫైండ్‌ ధృవ్‌ అంటూ సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌ చేశారు.