పవన్.. ఏంటి ఈ కన్ఫ్యూజన్ !

వచ్చే ఎన్నికల్లో గెలిచి ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో( assembly elections ) అడుగు పెట్టాలని పవన్ దృఢ సంకల్పంతో ఉన్నారు.అందుకోసం ఏం చేయడానికైనా సిద్దమని, ఎలాంటి వ్యూహాలైన వేస్తానని చెబుతున్నారు.

 Is Pawan Kalyan Confused Details, Ap News,ap Political News,pawan Kalyan,janasen-TeluguStop.com

ఇక నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారాహిపై తన విజయ యాత్రను మొదలు పెట్టారు పవన్.తొలి దశలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలోని 11 నియోజిక వర్గాలలో ఈ యాత్ర కొనసాగనుంది.

ఇక నిన్న ప్రారంభం అయిన యాత్రలో భాగంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలిటికల్ హిట్ ను పెంచుతున్నాయి.వచ్చే ఎన్నికలతో తాను ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడతానని, తనను ఎవడు ఆపుతాడో చూస్తానని తనదైన రీతిలో హాట్ కామెంట్స్ చేశాడు.

Telugu Ap, Janasena, Janasena Tdp, Jenasena, Pawan Kalyan, Pawankalyan-Politics

గత ఎన్నికల్లో తనపై కక్ష గట్టి ఓడిపోయేలా చేశారని, ఈసారి మాత్రం ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన అసెంబ్లీలో అడుగు పెట్టి తీరుతానని సవాల్ సవాల్ విసిరారు.ఈ సందర్భంగా పొత్తులపై ( on alliances ) కూడా మరోసారి స్పందించారు పవన్( Pawan kalyan ).ఒంటరిగా రావాలో.ఉమ్మడిగా రావాలో ఇంకా తేల్చుకోలేదని చెప్పుకొచ్చారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలతో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది.నిన్న మొన్నటి వరకు టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చిన పవన్ ఇప్పుడు మళ్ళీ పొత్తు పై బిన్నంగా స్పందించడంతో పవన్ ఏం ఆలోచిస్తున్నారనే కన్ఫ్యూజన్ అందరిలోనూ మొదలైంది.

Telugu Ap, Janasena, Janasena Tdp, Jenasena, Pawan Kalyan, Pawankalyan-Politics

అయితే పవన్ ఇలా రెండు విధాలుగా మాట్లాడడం వెనుక సరైన వ్యూహం ఉందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ప్రస్తుతం జనసేన పార్టీ( Janasena party ) పైనే వైసీపీ ( YCP ) ఎక్కువ ఫోకస్ చేస్తోంది.జనసేనను నిలువరిస్తే.తమకు తరుగుండదనే భావనలో వైసీపీ నేతలు ఉన్నారు.అందుకే ప్రతిసారి పవన్ టార్గెట్ గా దత్త పుత్రుడని, సింగిల్ గా పోటీ చేయలేని వాడని ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు.అయితే ఆ విమర్శల వెనుక అసలు ప్లాన్.

పవన్ సింగిల్ గా పోటీ చేసేలా చూడడమే.అందుకే వైసీపీ ప్లాన్ గమనించిన పవన్.

వారినే కన్ఫ్యూజన్ లో పడేసే విధంగా పొత్తులపై అసలు క్లారిటీ ఇవ్వకుండా సరిగ్గా ఎన్నికల సమయానికి తన పూర్తి నిర్ణయాన్నిప్రకటించే విధంగా వ్యూహాన్ని రచిస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చలు నడుస్తున్నాయి.మొత్తానికి వ్యూహం ఏదైనా.

అసెంబ్లీలో అడుగు పెట్టడమే లక్ష్యంగా పవన్ పావులు కడుపుతున్నారు.మరి తాను అనుకున్న లక్ష్యాన్ని పవన్ చేరుకుంటారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube