పవన్ ను 'ముద్రగడ' అందుకే టార్గెట్ చేశారా ?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం బహిరంగ సభలో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పరోక్షంగా ముద్రగడ పద్మనాభం వ్యవహారంపై స్పందించారు.కాపు కులాన్ని వాడుకుని నాయకులు ఎదుగుతున్నారు తప్ప,  కులాన్ని ఎదగనీయడం లేదని , ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు తగ్గడం, పెరగడం ఉండకూడదు అంటూ పవన్ మాట్లాడారు.

 Pawan Was Targeted Because Of 'mudragada', Mudragada Padmanabam, Kapu Caste, Jan-TeluguStop.com

యువతను వాడుకుని వారి భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే నాయకుల వెంట వెళ్లాలో లేదో మీరే డిసైడ్ చేసుకోవాలని, కాపు రిజర్వేషన్లకు( Kapu reservations ) కట్టుబడి ఉన్నవారు ఎప్పుడు ఒకటే మాట మాట్లాడాలి అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా ముద్రగడ పద్మనాభం పై విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలపై ముద్రగడ ఘాటుగానే స్పందించారు.

ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదంటూ ముద్రగడ( mudragada ) లేఖలో పేర్కొన్నారు నేను ఉద్యమాన్ని వదిలేసాను సరే… మీరు ఎందుకు దాన్ని అందుకుని నడిపించడం లేదని పవన్ ను ప్రశ్నించారు.

అలాగే పవన్ మాట్లాడుతున్న భాష పైన ముద్రగడ అభ్యంతరం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు.

Telugu Janasena, Janasenani, Kapu, Pavan Kalyan, Varahi-Politics

ఇక అదే సందర్భంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ( Dwarampudi Chandrasekhar Reddy )అంశాన్ని ముద్రగడ ప్రస్తావించారు.చంద్రశేఖర్ రెడ్డి చేసిన సవాల్ స్వీకరించి ఆయనపై పోటీ చేసి సత్తా చూపాలని.175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేనప్పుడు సీఎం పదవి కావాలనడం ఏంటి అంటూ ముద్రగడ ఫైర్ అయ్యారు .దీనికి జనసేన నేతలు కౌంటర్ ఇస్తూ.ముద్రగడపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

అయితే ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ టార్గెట్ చేసుకోవడం వెనక కారణాలు ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు ముద్రగడ ను పవన్ నేరుగా కలిసింది లేదు.కాపు ఉద్యమ సమయంలో పవన్ మద్దతు ఇస్తారని ముద్రగడ చూసినా పవన్ పట్టించుకోకపోవడం, కుల పెద్దగా తాను కీలకంగా ఉన్నా పవన్ పట్టించుకోనట్టుగా వ్యవహరించడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలోనూ తనను కలిసేందుకు ప్రయత్నించకపోగా, తననే టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడంపై ముద్రగడ ఆగ్రహం చెందారట.

అందుకే పవన్ ను ఈ విధంగా టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారట.

Telugu Janasena, Janasenani, Kapu, Pavan Kalyan, Varahi-Politics

అంతేకాకుండా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, పవన్ టార్గెట్ చేసుకోవడం ద్వారా హైప్ అయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉండడంతోనే, ఆ పార్టీకి మద్దతుగా పవన్ కు ఇంత తీవ్ర స్థాయిలో ముద్రగడ కౌంటర్ ఇచ్చారనే అనుమానాలు కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube