జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫిబ్రవరి 14వ తారీకు అనగా రేపు బుధవారం వేమవరం పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఈ పర్యటనలో హెలికాప్టర్ ల్యాండింగ్ ( Helicopter landing )కి సంబంధించి కూడా జనసేన పార్టీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో పవన్ భీమవరం పర్యటన రద్దయింది.ముందు రోడ్డు మార్గంలో భీమవరంకి ( Bhimavaram )పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పినా ఇప్పుడు పర్యటన వాయిదా వేయడం జరిగింది.
అయితే తిరిగి పర్యటన ఎప్పుడు ఉంటుందో తెలియజేస్తామని జనసేన ఇన్చార్జి గోవిందరావు పేర్కొన్నారు.
2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆ సమయంలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్( Grandhi Srinivas ) గెలవడం జరిగింది.కాగా 2024 ఎన్నికలలో మరోసారి భీమవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండు నెలలు సమయం ఉండటంతో ఫిబ్రవరి 14 నుండి భీమవరం నుండి ఎన్నికలకు రెడీ కావాలని పవన్ కళ్యాణ్ భావించారు.అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించి చివరి నిమిషంలో అనుమతులు రాకపోవటంతో పర్యటన రద్దు కావడం జరిగింది.
దీంతో భీమవరం జనసేన నాయకులూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లే కారణం అని జనసేన సోషల్ మీడియా విభాగం ఆరోపిస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది.