పవన్ ఎన్నికల్లో ఓడిపోయాడని కామెంట్లు చేసేవాళ్లకు ఇదే జవాబు.. తొక్కేయ్ లేస్తా అంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో భారీస్థాయిలో విజయాలను సొంతం చేసుకున్నారు.భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

 Pawan Kalyan Strong Counter With Bheemla Naik Movie Details Here , Bheemla Nayak-TeluguStop.com

ఈ సినిమా విజయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.భీమ్లా నాయక్ తొలిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

భీమ్లా సక్సెస్ నిత్యామీనన్ కు, రానాకు, సంయుక్త మీనన్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.

అయితే పవన్ పై విమర్శలు చేసేవాళ్లు ఎక్కువగా పవన్ రాజకీయాల గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ కు అనుకూల ఫలితాలు దక్కలేదు.అయితే తన గురించి నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్లకు భీమ్లా నాయక్ సినిమాలోని డైలాగ్ ద్వారా పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు.

ఓటమికి తాను భయ పడనని పవన్ గతంలోనే చెప్పారు.

భీమ్లా నాయక్ ఇంటర్వెల్ కు ముందు పవన్ కళ్యాణ్ రానాతో నన్ను తొక్కేయ్ లేస్తా.పీకేయ్ మళ్లీ మొలుస్తా.తోసేయ్ మళ్లీ వస్తా అని చెప్పారు.

ఎన్నికల్లో ఓటమి ఎదురైనా తాను వెను కడుగు వేయనని పవన్ కళ్యాణ్ పరోక్షంగా తనపై వ్యక్త మయ్యే విమర్శలకు చెక్ పెట్టారు.మరోవైపు పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

యుద్ధంలో ఓడిపోతాం అనే భయం లేనివాళ్లు ఎవరికీ తలవంచరని పవన్ మరో డైలాగ్ ను సినిమాలో చెప్పుకొచ్చారు.నిజ జీవితంలో ఎదురయ్యే విమర్శలకు పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా చెక్ పెట్టారు.పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

పవన్ ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Pawan Kalyan Strong Counter With Bheemla Naik Movie Details Here

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube