వాళ్లే నా ఫేవరెట్ హీరోస్ ... ఆ ఇద్దరిపై మంచు మనోజ్ ప్రశంశలు?

మంచు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాల నటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న మనోజ్ దొంగ దొంగది చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి క్రేజ్ దక్కించు కున్నారు.

 They Are-my Favorite Heroes Manchu Manoj Praises Those Two , Manchu Manoj , Toll-TeluguStop.com

ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మనోజ్ గత కొద్ది కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఇక సినిమాలకు కొన్ని కారణాల వల్ల దూరమైన మనోజ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడం లేదా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మనోజ్ సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఎంతో ఇష్టమైన తన ఫేవరెట్ హీరోల గురించి ప్రస్తావిస్తూ వారి పై ప్రశంసలు కురిపించారు.

ఇక శుక్రవారం రానా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల కావడం ఈ సినిమా మొదటి షో తోనే హిట్ టాక్ సంపాదించు కోవడంతో పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు హీరోలు దర్శకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశారు.ఈ సందర్భంగా మంచు మనోజ్ సైతం ఈ సినిమా పై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

నాకు ఎంతో ఇష్టమైన ఆ ఇద్దరు హీరోలు ఇలా ఒకే ఫ్రేమ్ లో ఉండడం ఎంతో సంతోషంగా ఉంది.ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మంచి స్పందన దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు.నా డార్లింగ్ రానా దగ్గుబాటికి… మొత్తం చిత్ర బృందానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ తన ఫేవరెట్ హీరోస్ పవన్,రానా అని తెలియజేశారు.

They Are-my Favorite Heroes Manchu Manoj Praises Those Two - వాళ్లే నా ఫేవరెట్ హీరోస్ ఆ ఇద్దర

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube