3D లో రాబోతున్న ‘హరి హర వీరమల్లు’..లేట్ గా వచ్చినా చరిత్రలో మర్చిపోని విధంగా ప్లానింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘హరి హర వీరమల్లు'( Hari Hara Veeramallu ). ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎదో ఒక కారణం చేత షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

 Pawan Kalyan Hari Hara Veera Mallu To Release In 3d Version-TeluguStop.com

ఫలితంగా అభిమానుల్లో తీవ్రమైన అసహనం కలిగించేలా చేస్తుంది.ఇప్పటి వరకు ఈ సినిమా 70 శాతం వరకు షూటింగ్ ని పూర్తి చేసుకుంది.

మిగిలిన 30 శాతం పూర్తి చెయ్యడానికి మేకర్స్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.ఆ చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం మాత్రం కచ్చితంగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, ఎన్నికల లోపు విడుదల చేస్తామని చెప్పాడు.

కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ప్రధానంగా ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagath Singh ) చిత్రాలపైనే కేంద్రీకరించాడు.ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయితేనే ఆయన ‘హరి హర వీరమల్లు’ కి డేట్స్ ఇస్తాడట.

అయితే సినిమా ఎంత ఆలస్యం గా విడుదలైనా కూడా, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే సునామి ముందు, ఏ సినిమా కూడా నిలబడదు అని అంటున్నారు.అంత గొప్పగా వచ్చిన స్క్రిప్ట్ అట ఇది.

Telugu Harihara, Krish, Niddhi Agerwal, Pawan Kalyan, Tollywood-Movie

అంతే కాకుండా మేకర్స్ ఈ చిత్రం లోని ప్రతీ సన్నివేశానికి ఫ్యాన్స్ చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో డ్యాన్స్ వేసి, ఈలలు వేసే విధంగా తీర్చిదిద్దారట.ఇక ఈ సినిమాని అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల చెయ్యడమే కాకుండా, 3D వెర్షన్( Hari Hara Veeramallu 3D Version ) ) లో కూడా విడుదల చెయ్యబోతునట్టుగా సమాచారం అందుతుంది.ఇప్పుడు 3D లో విడుదల అవుతున్న సినిమాలకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు.రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రానికి ఆ మాత్రమైనా వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం 3D వల్లే అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

Telugu Harihara, Krish, Niddhi Agerwal, Pawan Kalyan, Tollywood-Movie

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బందిపోటు దొంగగా కనిపిస్తున్నాడు.మన భారత దేశ సంస్కృతి ని తెలియచేసే చిత్రం గా ఈ సినిమా ఉంటుందట.పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ ఫిలిం అని, ఎప్పుడు రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ లో ఉండే ఛాన్స్ ఉందట.

పవన్ కళ్యాణ్ కేవలం 23 రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ చిత్రం పూర్తి అవుతుంది.ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube