3D లో రాబోతున్న ‘హరి హర వీరమల్లు’..లేట్ గా వచ్చినా చరిత్రలో మర్చిపోని విధంగా ప్లానింగ్!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి 'హరి హర వీరమల్లు'( Hari Hara Veeramallu ).
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎదో ఒక కారణం చేత షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
ఫలితంగా అభిమానుల్లో తీవ్రమైన అసహనం కలిగించేలా చేస్తుంది.ఇప్పటి వరకు ఈ సినిమా 70 శాతం వరకు షూటింగ్ ని పూర్తి చేసుకుంది.
మిగిలిన 30 శాతం పూర్తి చెయ్యడానికి మేకర్స్ పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం మాత్రం కచ్చితంగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, ఎన్నికల లోపు విడుదల చేస్తామని చెప్పాడు.
కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ప్రధానంగా 'ఓజీ' మరియు 'ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagath Singh ) చిత్రాలపైనే కేంద్రీకరించాడు.
ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయితేనే ఆయన 'హరి హర వీరమల్లు' కి డేట్స్ ఇస్తాడట.
అయితే సినిమా ఎంత ఆలస్యం గా విడుదలైనా కూడా, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే సునామి ముందు, ఏ సినిమా కూడా నిలబడదు అని అంటున్నారు.
అంత గొప్పగా వచ్చిన స్క్రిప్ట్ అట ఇది. """/" /
అంతే కాకుండా మేకర్స్ ఈ చిత్రం లోని ప్రతీ సన్నివేశానికి ఫ్యాన్స్ చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో డ్యాన్స్ వేసి, ఈలలు వేసే విధంగా తీర్చిదిద్దారట.
ఇక ఈ సినిమాని అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదల చెయ్యడమే కాకుండా, 3D వెర్షన్( Hari Hara Veeramallu 3D Version ) ) లో కూడా విడుదల చెయ్యబోతునట్టుగా సమాచారం అందుతుంది.
ఇప్పుడు 3D లో విడుదల అవుతున్న సినిమాలకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు.
రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రానికి ఆ మాత్రమైనా వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం 3D వల్లే అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.
"""/" /
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో బందిపోటు దొంగగా కనిపిస్తున్నాడు.మన భారత దేశ సంస్కృతి ని తెలియచేసే చిత్రం గా ఈ సినిమా ఉంటుందట.
పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ ఫిలిం అని, ఎప్పుడు రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ డిసెంబర్ లో ఉండే ఛాన్స్ ఉందట.
పవన్ కళ్యాణ్ కేవలం 23 రోజులు డేట్స్ కేటాయిస్తే ఈ చిత్రం పూర్తి అవుతుంది.
ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నిధి అగర్వాల్( Nidhhi Agerwal ) హీరోయిన్ గా నటిస్తుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయ్ హవా.. బాలయ్య ఎన్టీఆర్ సత్తా చాటుతున్నారుగా!