పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయంగా సంచలనం సృష్టిస్తూ మరో వైపు సినిమా ల్లో కూడా సందడి చేస్తున్నాడు.తాజాగా పవన్ కళ్యాణ్ తాను తెలుగు దేశం పార్టీ ( Telugu Desam Party )తో కలిసి వెళ్లబోతున్నట్లుగా ప్రకటించడం వల్ల రాజకీయంగా హీట్ పెంచాడు.
అదే సమయంలో వరుసగా సినిమా ల్లో నటిస్తున్న కారణంగా ఇండస్ట్రీ లో కూడా హిట్ పెంచుతున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాహో సుజీత్ దర్శకత్వం లో ఓజీ( OG ), హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh )మరియు క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఆ మూడు సినిమా లు కూడా చాలా విభిన్నమైనవి.ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ మూవీ అనే వార్తలు వస్తున్నాయి .మిగిలిన రెండు సినిమా లు డైరెక్ట్ సినిమాలు.
మొన్నటి వరకు హరి హర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమా గురించి చాలా ఆసక్తి అందరి లో కనిపించింది.కానీ ఇప్పుడు ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు.పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా సాహో రేంజ్ లో ఓ భారీ యాక్షన్ సినిమా ను సాహో సుజీత్ రూపొందిస్తున్నాడు.అందుకే విడుదలకు ముందే ఈ సినిమాకు దాదాపుగా రూ.250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వబోతున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు.150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ను ఆ రేంజ్ బిజినెస్ చేసే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటే ఆయన స్థాయి మరియు ఆయన ఎంపిక చేసుకున్న కథ ఏంటో అర్థం చేసుకోవచ్చు.రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసే విధంగా ఓజీ సినిమా ఉంటుందనే నమ్మకం ను పవన్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా పై కూడా మంచి బజ్ ఉంది.