ఆ ఇద్దరు హీరోలు నా క్రష్ అసలు విషయం చెప్పిన పవిత్ర లోకేష్!

పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారిన పేర్లలో ఒకటి.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Pavitra Lokesh Said The Real Thing Details , Pavitra Lokesh, Naresh,malli Pelli-TeluguStop.com

ఇలా పలు సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ ఉంటున్నారని వార్తలు వచ్చాయి.ఈ వార్తలు నిజమేనని వీరిద్దరూ ప్రకటించడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనీ ప్రకటించారు.

ఇలా నరేష్(Naresh) వ్యవహారంతో పవిత్ర ఎంతో ఫేమస్ అయ్యారు.ఇలా వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి(Malli Pelli) సినిమా ద్వారా ప్రేక్షులముందుకు వచ్చారు.

ఈ సినిమా మే 26 న విడుదల అయ్యి మిశ్రమ స్పందన లభించుకుంది.ఈ సినిమా విడుదలకు ముందునరేష్ పవిత్ర లోకేష్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా నరేష్ పవిత్ర లోకేష్ ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .నాకు ఇద్దరు హీరోలు అంటే క్రష్ అని తెలియజేశారు.నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాగార్జున(Nagarjuna) గారు నటించిన గీతాంజలి(Geethanjali) సినిమా విడుదలైంది అయితే ఈ సినిమా చూసినప్పుడు ఆయనంటే క్రష్ ఏర్పడింది.

నాకు భర్త అంటూ ఉంటే అలాంటి వ్యక్తి ఉండాలన్న ఫీలింగ్ నాగార్జున గారిని చూస్తేనే కలిగిందని పవిత్ర లోకేష్ తెలియజేశారు.ఇక నాగార్జున తర్వాత అదే రేంజ్ లో తనకు నచ్చినటువంటి వారిలో నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఒకరని తెలియజేశారు.నాగార్జున ప్రకాష్ రాజ్ ఇద్దరు నా క్రష్ అంటూ ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube