పావలా శ్యామల కష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తాయ్.. తిండికి కూడా దిక్కులేని స్థితిలో?

ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు వస్తుంటారు పోతుంటారు.అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఎదిగే ఉంటారు అని చాలామంది అనుకోవచ్చు.

 Pavala Syamala Struggles Financial Proble, Golimar, Pavala Syamala, Strugle Fina-TeluguStop.com

ఇండస్ట్రీలో ఉన్నంతవరకు ఎంతోకొంత వెనకేసుకొని మంచి లైఫ్ లో గడుపుతూ ఉంటారు అనుకోవడం లో తప్పేమీ లేదు.కానీ అలా అందరి విషయంలో అలా జరగదు అని నేరుగా పావలా శ్యామల ని చూస్తే అర్థమవుతుంది.

ఇలా ఎంతో మంది సెలబ్రెటీలు తమ నిజ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులతో రోడ్డున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు.

ఇక తాజాగా తెలుగు సినీ ఆర్టిస్ట్ పావలా శ్యామల.

ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు.ఇంతకీ ఆమె ఎవరా అని చాలామంది గుర్తుపట్టక పోవచ్చు.

కానీ తను గోపీచంద్ నటించిన గోలీమార్ సినిమా లో విలన్ ఫోన్ చేసినప్పుడు తన మాటలతో బాగా నవ్వించింది.ఇప్పటికే ఆ సీన్ వస్తుంటే నవ్వలేక ఉండలేం.

ఆవిడే ఈ శ్యామల.ప్రస్తుతం ఆమె ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

తన కూతురు అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా తను ఏం చేయలేని పరిస్థితిలో ఉంది.ఎన్నో సినిమాలలో మంచి గుర్తింపు పొందిన శ్యామల దాదాపు 250 సినిమాల్లో నటించి అవార్డులు, రివార్డులు అందుకుంది.

కానీ ఆమె మంచి స్థాయిలో ఉందనుకోవడం పొరబాటే అనుకోవచ్చు.ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది.నిజానికి తాను అద్దె ఇంట్లో ఉంటూ సంజీవని గడుపుతుంది.

గతంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున నెలకు పదివేల రూపాయలు పెన్షన్ వచ్చేలా అందించారు.

కానీ ఇప్పుడు అవి కూడా సరిగా రావట్లేదని, గత మూడు నెలల నుండి అద్దె కూడా కట్టలేక పోతున్నానన్న ఆవేదన చెందుతుంది.ఇక తన ఆర్థిక విషయాన్ని తెలుసుకున్న ఆర్టిస్టు కరాటే కళ్యాణి తన వంతు సహాయాన్ని అందించింది.

అంతేకాకుండా తమ అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందజేసే ప్రయత్నం చేస్తానంటూ పైగా ప్రతి ఒక్కరూ పావలా శ్యామల ను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube