భారత దేశవ్యాప్తంగా మహిళలు( Women ) అన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు.విమానయానం మొదలుకుని నీటిపై పెద్ద పెద్ద ఓడలను సైతం అవలీలగా వారు ఇపుడు నడిపేస్తున్నారు.
అయితే, ఈ క్రమంలో కొన్ని ప్రదేశాలలో కేవలం మహిళలలు మాత్రమే పనిచేస్తున్న దాఖలాలు వున్నాయి.ఇప్డు మనం చెప్పుకోబోయేది అలాంటి ప్రదేశాల గురించే.
అవే కేవలం మహిళలతో మాత్రమే నిర్వహించబడుతోన్న రైల్వేస్టేషన్లని చాలా మందికి తెలిసి వుండదు.
అవును, ముఖ్యంగా మనదేశంలో ఇలా మహిళలతో నిర్వహిస్తోన్న రైల్వేస్టేషన్లు ఇపుడు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.నాగ్‌పూర్‌లోని రైల్వే స్టేషన్( Railway station in Nagpur ) మహారాష్ట్రలో 2వది, అదేవిధంగా దేశంలో 3వదిగా పేరుగాంచినది.దీనిని మహిళలు మాత్రమే నడుపుతున్నారు.
ఇది సెంట్రల్ రైల్వేలోని నాగ్‌పూర్ విభాగంలో ఒక భాగం.ఈ స్టేషన్లో రోజుకు 6000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
ఇక్కడ 22 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ భవనంలో 17 ఎస్కలేటర్లు, 21 లిఫ్టులు, 6 ట్రావెలేటర్లు ఉంటాయి.
స్టేషన్ మొత్తం డిసేబుల్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
అంతేకాకుండా, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న గాంధీ నగర్ రైల్వే స్టేషన్ ( Gandhi Nagar Railway Station )పూర్తిగా మహిళలచే నిర్వహించబడుతుంది.దేశంలో మహిళలు మాత్రమే నిర్వహించే తొలి స్టేషన్ ఇదేనని చెబుతారు.ఇక్కడ స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ చెకర్ వరకు ప్రతి పనిని మహిళలే నిర్వహిస్తారు.
అదేవిధంగా ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ కేవలం మహిళా ఉద్యోగులు మాత్రమే ఉండే స్టేషన్.మాతుంగా రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి ఇది వస్తుంది.ఇక్కడ కేవలం మహిళ ఉద్యోగులు మాత్రమే ఉంటారు.ఇది లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2018లో కూడా నమోదు చేయబడింది.
ఇక అహ్మదాబాద్‌లోని మణినగర్ రైల్వేస్టేషన్ ( Maninagar Railway Station )దేశంలో నాల్గవ స్టేషన్.ఇక్కడ మహిళా ఉద్యోగులు మాత్రమే ఉన్నారు.
ఈ స్టేషన్లో మొత్తం 23 మంది క్లర్కులు, ఒక స్టేషన్ మాస్టర్, ఇద్దరు పాయింట్ పర్సన్లు ఉన్నారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన పది మంది మహిళా సైనికులు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ సెక్షన్లో ఉంది.దేశంలో కేవలం మహిళలే నిర్వహించే ఐదవ స్టేషన్ ఇది.ఈ రైల్వేస్టేషన్లో స్టేషన్‌మాస్టర్ నుంచి పోలీసు సిబ్బంది వరకు ఉద్యోగులంతా మహిళలే అని సమాచారం.